Big Stories

Oleander Flowers Ban: ఆలయాల్లో ఎర్రగన్నేరు పూలపై నిషేధం.. ఎందుకంటే..?

Oleander Flowers Banned in Kerala Temples: ఎర్ర గన్నేరు పువ్వులు, అరళీ పువ్వులుగా పిలుచుకునే ఒలియాండర్ పువ్వులను ఆలయాల్లో ఉపయోగించడంపై కేరళలో రెండు దేవస్థాన బోర్డులు నిషేధం విధించాయి. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు, మలబార్ దేవస్వోమ్ బోర్డుల పరిధులలో ఉన్న అన్ని ఆలయాల్లో పవిత్ర ఆచారాలలో ఈ పువ్వులను వినియోగించడంపై నిషేధం విధించాయి. ఒలియాండర్ పువ్వులు మానవులు, జంతువులకు కూడా హాని కలిగించే లక్షణాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వోమ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.

- Advertisement -

ఎర్రగన్నేరు పువ్వులకు బదులుగా తులసి, మల్లె, చామంతి, తేచి, గులాబీ వంటి పువ్వులను వినియోగిస్తామని వెల్లడించారు. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు పరిధిలోని 1248 దేవాలయాలు, మలబార్ దేవస్వోమ్ బోర్డు పరిధిలోని 1400 దేవాలయాల్లో ఈ పువ్వులను వాడటం లేదని పేర్కొన్నారు.

- Advertisement -

Also Read: పారిజాత పువ్వులతో పూజ చేయకూడదా..? వాస్తవమేంటి?

ఇటీవల అలప్పుజాలో ఈ పువ్వులను తినడంతో సూర్యా నరేంద్రన్ (24) అనే యువతి మృతి చెందింది. నర్సింగ్ చేసిన ఆ యువతి.. ఉద్యోగంలో చేరేందుకు యూకే కు పయనమైంది. నెడుంబస్సేరి ఎయిర్ పోర్టుకు చేరుకోగానే కుప్పకూలింది. అందుకే వీటిని నైవేద్యాలలో ఉపయోగించడంపై నిషేధం విధించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ పువ్వులలో కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉంటాయని, ఇవి గుండెకు హాని చేస్తాయని వైద్యులు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News