World Club Championship : ఛాంపియన్ లీగ్ T-20 పునరాగమనానికి సిద్ధంగా ఉన్నట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి. కాకపోతే ఇది వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్ అనే పేరుతో ప్రారంభం కానుంది. వాస్తవానికి ఇందులో అన్ని దేశాల లీగ్ ల నుంచి టాప్ 2 టీమ్స్ పాల్గొంటాయి. ఐపీఎల్ టాప్ 3, ఆస్ట్రేలియన్ బిగ్ బాస్ టాప్ 2, సౌతాఫ్రికా SAT20 లో టాప్ 2 టీమ్స్, ఇంగ్లాండ్ 100 లీగ్ లో టాప్ 2 టీమ్స్ అలా అన్ని మేజర్ లీగ్ నుంచి పాల్గొంటాయి. దీనిని మిని ఐపీఎల్ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి ఇది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఇలాగే జరిగాయి. ఇది కొన్ని ప్రధాన క్రికెట్ దేశాల నుంచి అర్హత సాధించిన దేశీయ జట్ల మధ్య జరిగే వార్షిక అంతర్జాతీయ టీ20 క్రికెట్ పోటీ. వాస్తవానికి దీనిని 2008లో ప్రారంభం కాగా.. 2014 వరకు కొనసాగింది. 2014లో ఎం.ఎస్. ధోనీ కెప్టెన్సీలో చివరిసారిగా ట్రోఫీ అందుకున్నారు. ఇక ఆ తరువాత నుంచి ఈ లీగ్ జరుగలేదు. 2026లో ఈ టోర్నీ పున: ప్రారంభం కానున్నట్టు సమాచారం. ప్రపంచ క్లబ్ ఛాంపియన్ షిప్ గా రీ బ్రాండ్ చేయబడనున్నట్టు తెలుస్తోంది.
Also Read : Ishan Kishan – CSK : కావ్య పాప బిగ్ స్కెచ్.. SRH లోకి CSK సిక్సుల వీరుడు!
అత్యధికంగా భారత జట్లే..
ఛాంపియన్ లీగ్ T20 ప్రారంభ ఎడిషన్ 2009లో జరిగింది. 2014 వరకు ప్రతీ ఏడాది నిర్వహించారు. వీక్షకుల కొరత, స్పాన్సర్ షిప్ సమస్యల కారణంగా టోర్నమెంట్ 2015 నిలిపివేయబడింది. కేవలం నాలుగు లీగ్‌ల జట్లు మాత్రమే పాల్గొనేవి. IPL అత్యధిక స్లాట్‌లను పొందింది-మూడు. CSK- MI ప్రతి రెండు విజయాలతో అత్యంత విజయవంతమైన జట్లు. ఇప్పుడు పునరుజ్జీవనానికి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రతి దేశంలోనూ T20 లీగ్‌లు ఉన్నాయి. కొత్త టోర్నమెంట్‌లో మరిన్ని జట్లు పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది. ఇక ఇది ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్‌కు క్రికెట్ సమాధానంగా మారవచ్చు. వాస్తవాని ఈ లీగ్ 2008లో ప్రారంభమైనప్పటికీ ముంబై లో దాడుల కారణంగా రద్దు చేయబడింది. 2009లో న్యూ సౌత్ వేల్స్ బ్లూస్ టీమ్ విజయం సాధించింది. 2010లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.
2026లో పున: ప్రారంభం గ్యారెంటీ..
ఛాంపియన్ లీగ్ T20 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. 2012లో సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పై ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించగా.. ఇక 2010లో కోల్ కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఈ లీగ్ లో అత్యధికంగా ముంబై ఇండియన్స్ 2, చెన్నై సూపర్ కింగ్స్ 2 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు ఇండియా టీమ్ లు కావడం విశేషం. ప్రస్తుతం 2026 సీజన్ లో ఈ లీగ్ ను ప్రారంభించాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇక టీమ్ లను కూడా పెంచేసి ఈ లీగ్ లను నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రధానంగా భారతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నందున.. అన్ని ఎడిషన్లలో భారతదేశం నుంచి ఎక్కువ జట్లు పాల్గొన్నాయి. భారత దేశం మినహా మరే ఇతర దేశం కంటే ఎక్కువ జట్లు పాల్గొనలేదు. ఇక 2011 నుండి భారత్ నుంచి నాలుగు జట్లు పోటీ పడగా.. ఇక ఇతర దేశాలు గరిష్టంగా రెండు జట్లను మాత్రమే కలిగి ఉన్నాయి. వచ్చే సీజన్ లో ఒకవేళ పున: ప్రారంభమైతే ఎలాగా నిర్వహిస్తారో వేచి చూడాలి మరీ.
?igsh=MWVnY3R5Y3M3NGJ5Mw==