BigTV English

Ishan Kishan – CSK : కావ్య పాప బిగ్ స్కెచ్.. SRH లోకి CSK సిక్సుల వీరుడు!

Ishan Kishan – CSK : కావ్య పాప బిగ్ స్కెచ్.. SRH లోకి CSK సిక్సుల వీరుడు!

Ishan Kishan – CSK : ఐపీఎల్ సీజన్ 2025  ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ సాధించింది. ఐపీఎల్ ఈ ఏడాది ముగియగానే వచ్చే ఏడాదికి ఏయే జట్లు ఎవరెవరినీ ఉంచుకుంటాయి. ఎవరెవరినీ వదులుకుంటాయి అనే చర్చ నడుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వచ్చే ఏడాదికి బిగ్ స్కెచ్ వేసినట్టు సమాచారం. ట్రేడింగ్ అనే ఆప్షన్ ద్వారా శివం దూబేను.. హైదరాబాద్ జట్టులోకి కావ్య పాపా తీసుకోబోతున్నారట.  అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కి చెందిన ఆటగాడు ఇషాన్ కిషన్ ను చెన్నై సూపర్ కింగ్స్   తీసుకోబోతుందట.


Also Read : Jaiswal : స్టోక్స్ కుట్రలు… జైస్వాల్ ను బండ బూతులు తిడుతూ..!

ట్రేడింగ్ అంటే..? 


వాస్తవానికి ట్రేడింగ్ అంటే ఒక ప్లేయర్ మరో జట్టుకు.. అందులో ఉన్న మరో ప్లేయర్ ను ఇందులోకి తీసుకువస్తారు. శివమ్ దూబే సిక్సుల మోగించే విషయం తెలిసిందే. ఇషాన్ కిషన్ కూడా ఈ సీజన్ లో ఓ మ్యాచ్ లో సెంచరీ కూడా చేశాడు. ఒక రెండు, మూడు మ్యాచ్ ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతా మ్యాచ్ ల్లో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో ఇషాన్ కిషన్ వదిలించుకోవాలని కావ్య పాప భావిస్తున్నట్టు సమాచారం. సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి సిక్సర్ల వీరుడు శివం దూబే ను దించడానికి పథకం వేస్తోంది. ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడుతుందంటే.. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్ పైనే అందరి కళ్లు ఉంటాయి ఎందుకు అని ఓ ప్రశ్న తలెత్తింది. దీంతో కావ్య మారన్ స్పందించారు. వాస్తవానికి మ్యాచ్ జరుగుతున్నంత సేపు SRH ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం నిరాశగా ఉంటారు.

కావ్య పై మీమ్స్.. 

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావ్య పాపపై ఎక్కువగా మీమ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్ లో ఆడినప్పుడు నేను ఏమి చేయలేను. నేను ఒక చోట కూర్చోవాలి. అహ్మదాబాద్, చెన్నైలకు కూడా నేను టీమ్ ని ఉత్సాహపరచడానికి వెళ్తుంటా. నేను ఎక్కడో దూరంలో కూర్చున్నా కెమెరామెన్ నా హావభావాలను బంధిస్తాడు. అందుకే అవి మీమ్స్ గా మారుతున్నాయి. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. డేవిడ్ వార్నర్ అద్భుతమైన కెప్టెన్సీ తో జట్టును విజేతగా నిలిపాడు. 2016 నుంచి మరో టైటిల్ గెలవలేదు. 2018, 2024 ఐపీఎల్ ఫైనల్ కి చేరుకున్నప్పటికీ విజేతగా నిలవలేదు. 2025 సీజన్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరిచింది. సీజన్ ప్రారంభంలో అలరించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆపై వరుస పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది.

Related News

SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

Abhishek Sharma: SRHలో మిస్ అయింది… ఆసియా కప్ లో 300 కొడతాం… అభిషేక్ వార్నింగ్ !

Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్

Dhanashree Verma: చాహల్ టార్చర్… కేకలు పెట్టి ఏడ్చిన ధనశ్రీ!

Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం

Asia Cup 2025 : ఆసియా కప్ లో మొత్తం ముంబై, KKR ప్లేయర్లే

Big Stories

×