‘Cockroach’ protests: దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీటి పరీక్ష పేపర్ లీకేజీ, నిరుద్యోగుల సమస్యలు, విద్య వ్యవస్థలో సంస్కరణలు లాంటి అంశాలపై CJP పార్టీ ప్రతినిధులు నిరసనలకు దిగారు. జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామాజికవేత్తలు, క్రీడాకారులు కూడా ఈ అంశాలపై రియాక్ట్ అవుతున్నారు.
రెండు రోజుల కిందట ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ జార్జి పై కూడా స్పందిస్తూ… మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే ఈ కేటగిరీలో టీమిండియా క్రికెటర్ల భార్యలు, వాళ్ల ప్రియురాళ్ళు కూడా స్పందిస్తూ.. విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఢిల్లీ నిరసనల నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ల భార్యలు స్పందించగా… మరి మగాళ్ళకి ఏం రోగం? అంటూ ఫైర్ అవుతున్నారు. లండన్ నుంచి ఇండియాకు వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ క్రికెటర్లను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. టీమిండియా తరఫున ఆడుతున్న ప్రతి ఒక్క క్రికెటర్… విద్యార్థులకు అండగా నిలుస్తూ పోస్టులు పెట్టాలని రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజెన్స్.
భారత జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా జాతీయ సమస్య వచ్చినప్పుడు.. ఏది పడితే అది సోషల్ మీడియాలో పెట్టి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయకూడదు. టీమిండియా తరఫున ఆడుతున్న ప్రస్తుత అంతర్జాతీయ క్రికెటర్లు.. రాజకీయ ప్రకటనలు అస్సలు చేయకూడదు. ఈ మేరకు బీసీసీఐ స్పెషల్ రూల్స్ పెట్టింది. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు దేశ భద్రతకు సంబంధించిన జటిలమైన అంశం. ఇలాంటి అంశాలపై ఇండియన్ క్రికెటర్లు ఎవరు రియాక్ట్ కాకూడదు. ఐసీసీ, బీసీసీఐ రూల్స్ ప్రకారం దేశ భద్రతకు సంబంధించిన ఎలాంటి అంశాలపై క్రికెటర్లు స్పందించకూడదు.
ఒకవేళ స్పందించాల్సి వస్తే బీసీసీఐ పర్మిషన్ తీసుకోవాలి. అలా కాదని, రాజకీయ ప్రకటనలు చేస్తే ఇంటికి వెళ్లాల్సిందే. ఐసీసీ అలాగే బీసీసీఐ కఠినమైన రూల్స్ అమలు చేస్తున్న నేపథ్యంలోనే టీమ్ ఇండియా క్రికెటర్లు ఇప్పటివరకు ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. పోస్ట్ పెట్టలేదు. కానీ మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ లాంటివాళ్ళు సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. వాళ్లకి ఇలాంటి ప్రాబ్లం లేదు. అంతర్జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు మాత్రం స్పందించకూడదు. అందుకే తెలివిగా, తమ భార్యలతో పోస్టులు పెట్టిస్తున్నారు ఇండియన్ క్రికెటర్లు. ఇప్పటికే రోహిత్ శర్మ భార్య రితికా, సూర్య భార్య దేవిషా శెట్టి లాంటి వాళ్లు స్పందించారు. రింకూ సింగ్ కు కాబోయే భార్య పార్లమెంట్ సభ్యులు ప్రియా సరోజ్ అయితే, నేరుగా నిరసనల్లో పాల్గొన్నారు.