Rohit Sharma – Dilip: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 23 నుండి పాకిస్తాన్ వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృశ్య భారత్ తన మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడుతుంది. ఈ టోర్నీలో భారత సారధి రోహిత్ శర్మ “తగ్గేదే లే” అన్న విధంగా దూసుకు వెళుతున్నాడు. తనకి అచ్చొచ్చిన వైట్ బాల్ క్రికెట్లో జట్టును సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ టోర్నీలో భారత్ ఆడిన రెండు మ్యాచ్లలో విజయాలు సాధించి సెమీస్ కి క్వాలిఫై అయింది.
ఆ తర్వాత న్యూజిలాండ్ మ్యాచ్ రిజల్ట్ తో సంబంధం లేకుండా నాకౌట్స్ కి అర్హత సాధించింది. మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై, ఆ తరువాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఇక న్యూజిలాండ్ మ్యాచ్లో గెలిస్తే గ్రూప్ ఏ టాపర్ గా, ఒకవేళ ఓడిపోతే సెకండ్ ప్లేస్ లో భారత జట్టు సెమీస్ కి చేరుతుంది. ఆ తరువాత రెండు మ్యాచ్ లలో వరుసగా గెలిస్తే రోహిత్ సేన ఈ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. గత సంవత్సరం టీ-20 వరల్డ్ కప్ 2024 ని రోహిత్ శర్మ కెప్టెన్సీలో గెలిచిన భారత జట్టు.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని కూడా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
ఇక ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలోని తన మ్యాచ్ లని భారత్ దుబాయ్ వేదికగా ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే తరువాతి మ్యాచ్ న్యూజిలాండ్ తో జరగనున్న నేపథ్యంలో కాస్త సమయం దొరకడంతో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిబ్రవరి 25 మంగళవారం రోజు రాత్రి దుబాయ్ రోడ్లపై చక్కర్లు కొట్టాడు. భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తో కలిసి రోహిత్ శర్మ నిన్న రాత్రి దుబాయ్ వీధుల్లో పర్యటించగా.. ఒక్కసారిగా అభిమానులు రోహిత్ శర్మని చుట్టుముట్టారు.
కెప్టెన్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇక అంత మంది ఒకేసారి చుట్టూ ముట్టడంతో రోహిత్ శర్మ షాక్ కి గురయ్యాడు. అభిమానులంతా రోహిత్.. రోహిత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో దుబాయ్ వీధులలో రోహిత్ శర్మ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది దుబాయిలో కెప్టెన్ క్రేజీ మామూలుగా లేదంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం రోహిత్ వైన్ షాప్ కోసం దుబాయ్ వీధులలో తిరుగుతూ అభిమానులకు అడ్డంగా దొరికిపోయాడు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇక తాజాగా రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జీవిస్తుందే క్రికెట్ కోసమని, తనకి క్రికెట్ ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఐతే క్రికెట్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పే క్రమంలో.. తాను సంతోషంగా జీవించేందుకు మరింతకాలం క్రికెట్ ఆడతాననే విషయాన్ని చెప్పకనే చెప్పాడు రోహిత్ శర్మ. అలాగే విరాట్ కోహ్లీ రెండవ మ్యాచ్ లో ఆడిన తీరుపై ప్రశంసలకు వర్షం కురిపించాడు. దేశానికి ఆడడం అంటే విరాట్ కోహ్లీకి ఎంతో ప్రేమ అని, జట్టు కోసం ఏం చేయడానికి అయినా విరాట్ సిద్ధంగా ఉంటాడని తెలిపాడు.
Last night Captain Rohit Sharma spotted on Dubai streets with T Dilip And the Dubai streets was filled with crowd to see him.🥶🔥
The biggest supporter in world cricket @ImRo45 🐐 pic.twitter.com/BkglHMr5N8
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) February 26, 2025