ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిధ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 29 సంవత్సరాల తర్వాత ఓ మెగా టోర్నిని నిర్వహిస్తున్న దాయాది పాకిస్తాన్ లో భద్రత గురించి నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హైబ్రిడ్ మోడల్ లో జరుగుతున్న ఈ టోర్నీలో భరత్ తన మ్యాచ్ లు అన్నింటినీ దుబాయ్ వేదికగా ఆడుతుంది. అందువల్ల టీమిండియాకు ఎటువంటి ప్రమాదం లేదు. కానీ మిగతా మ్యాచ్లు అన్నీ పాకిస్తాన్ దేశంలో నిర్వహిస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ {ఐసిసి}.
Also Read: Litton Das – Keshav maharaj: శివరాత్రి పండగ…శివయ్యకు విదేశీ క్రికెటర్ల పూజలు !
అయితే పాకిస్తాన్ దేశంలో జరుగుతున్న మ్యాచ్ లకు ప్రమాదం పొంచి ఉందని తాజాగా పాకిస్తాన్ ఇంటలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ దేశంలో క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు వచ్చిన విదేశీ క్రికెట్ అభిమానులను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నారని గత రెండు రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు సోమవారం న్యూజిలాండ్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది.
దీంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను కోల్పోయి ఇంటిదారి పట్టాయి. అయితే న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి సడన్ గా గ్రౌండ్ లోకి దూసుకు వచ్చాడు. క్రికెటర్ల అభిమానులు వారిని కలిసేందుకు అలా పరిగెత్తుకు రావడం సాధారణమే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి.. చేతిలో ఓ తీవ్రవాద నాయకుడి ఫోటోని పట్టుకొని పరిగెత్తుకుంటూ బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర వైపు దూసుకు వచ్చాడు. దీంతో అతడు సూసైడ్ బాంబర్ అని అనుకొని రచిన్ రవీంద్ర భయపడి దూరంగా జరిగాడు.
ఆ తర్వాత అతడు వేగంగా వచ్చి రచిన్ ని వాటేసుకున్నాడు. ఈ ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ సరైన భద్రత కల్పించడం లేదంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రత లోపాల కారణంగా కొంతమంది పోలీసులను వారి ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ మెగాటోరిని సందర్భంగా తమకు కేటాయించిన భద్రత విధులను నిర్వర్తించడానికి నిరాకరించినందుకు.. పాకిస్తాన్ లోని పంజాబ్ కి చెందిన 100 మందికి పైగా పోలీసులను సర్వీస్ నుంచి తొలగించారు.
Also Read: Virat Kohli Fan Base: ఇదేం క్రేజ్ రా… కోహ్లీ కోసం పాకిస్థాన్ ప్రాణాలు ఇచ్చేలా ఉందిగా !
పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తొలగించబడిన సిబ్బంది పోలీస్ ధనంలోని వివిధ భాగాలకు చెందిన వారిని.. వారిని తొలగించినట్లు పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. లాహోర్ లోని గడాఫీ స్టేడియం నుంచి కేటాయించిన హోటళ్లకు ప్రయాణించే జట్లకు సరైన భద్రత కల్పించేందుకు పోలీస్ అధికారులను నియమించారని.. కానీ వారు విధులకు హాజరుకానందున బాధ్యతలనుండి తొలగించారని వెల్లడించారు. పంజాబ్ ఐజిపి ఉస్మాన్ అన్వర్ ఈ విషయాన్ని గుర్తించి.. సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆ అధికారి పేర్కొన్నారు.