E-Paper
Advertisement

గ్లోవ్స్ వివాదం..స్ట‌బ్స్ కు ఒక‌ న్యాయం, హార్దిక్ కు ఓ న్యాయమా? అంబానీకి అంపైర్లు అమ్ముడుపోయారంటూ

గ్లోవ్స్ వివాదం..స్ట‌బ్స్ కు ఒక‌ న్యాయం, హార్దిక్ కు ఓ న్యాయమా? అంబానీకి అంపైర్లు అమ్ముడుపోయారంటూ
Advertisement

Controversy Gloves: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక వివాదం రాజుకుంటోంది. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, వివాదాస్పద క్యాచ్ లు ( Controversy Gloves) లాంటి సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా గ్లోవ్స్ వివాదం ఐపీఎల్ టోర్నమెంట్ లో కొనసాగుతోంది. చెన్నై తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టబ్స్ ( Stubbs) గ్లోవ్స్ మార్చుకునేందుకు పర్మిషన్ ఇవ్వని అంపైర్లు, నిన్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ( Hardik Pandya) మాత్రం మిడిల్ ఓవర్ లో మాత్రం అనుమతి ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో అంబానీ ( Ambani ) తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని, అతనికి భయపడి అంపైర్లు గ్లోవ్స్ మార్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

స్ట‌బ్స్ కు ఓ న్యాయం, హార్దిక్ కు మ‌రో న్యాయమా?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గ్లోవ్స్ వివాదం రాజుకుంది. మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు స్టబ్స్ గ్లోవ్స్ మార్చుకునేందుకు పర్మిషన్ అడిగాడు.19.2 ఓవర్ దగ్గర ఈ సంఘటన జరిగింది. అయితే ఓవర్ మధ్యలో పర్మిషన్ ఇవ్వబోమని అంపైర్లు తేల్చి చెప్పారు. ఢిల్లీ కోచ్ హేమంగ్ బదానీ, నితీష్ రాణా ఇద్దరు కూడా అంపైర్లతో దీనిపై గొడవకు కూడా దిగారు. అయినా కూడా అంపైర్లు తగ్గలేదు. దీంతో తర్వాత బంతికే స్ట‌బ్స్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో హెల్మెట్ నేలకేసి కొట్టాడు. ఈ ఘటన వివాదంగా మారింది. నితీష్ రాణాపై ఫైన్ కూడా వేశారు.

అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య నిన్న మ్యాచ్ జరగగా హార్దిక్ పాండ్యాకు మాత్రం అంపైర్లు పర్మిషన్ ఇచ్చారు. 11.2 ఓవర్ల సందర్భంగా గ్లోవ్స్ మార్చుకునేందుకు వెంటనే పర్మిషన్ ఇచ్చి షాక్ ఇచ్చారు అంపైర్లు. దీంతో సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. స్టబ్స్ కు ఒక న్యాయం? హార్దిక్ పాండ్యాకు మరో న్యాయమా ? ఇదెక్కడి పద్ధతి.. అంబానికి అంపైర్లు అమ్ముడుపోయారని మండిపడుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇలాగే ఐపీఎల్ టోర్నమెంట్ కొనసాగితే, ఆదరణ పూర్తిగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

గ్లోవ్స్ మార్చుకోవడానికి ఏది కరెక్ట్ సమయం.. ఐసీసీ రూల్స్ ఇవే

Advertisement

ఒక ప్లేయర్ గ్లోవ్స్ మార్చుకోవడానికి ప్రత్యేక టైం కేటాయించింది ఐసీసీ. ఈ ఐసీసీ పెట్టిన రూల్స్ ను ఐపీఎల్ లో కూడా అమలు చేస్తున్నారు. డ్రింక్స్ బ్రేక్, స్ట్రాటజిక్ టైం ఔట్, ఓవర్ పూర్తయిన తర్వాత మాత్రమే ఒక ప్లేయర్ గ్లూస్ మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా గ్లోవ్స్ పూర్తిగా చెడిపోతే తప్ప, మార్చడానికి అనుమతి ఇవ్వరు అంపైర్లు. ఓవర్ మధ్యలో ఇలా పర్మిషన్ ఇస్తే బౌలర్ల రిధం చెడిపోతుందని ఐసీసీల రూల్స్ పెట్టింది. కానీ స్ట‌బ్స్‌ కు పర్మిషన్ ఇవ్వని అంపైర్లు పాండ్యాకు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

 

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×