BigTV English

Saree Controversy in Olympics 2024: సింధు ఒలింపిక్ చీరపై.. నెట్టింట దుమారం

Saree Controversy in Olympics 2024: సింధు ఒలింపిక్ చీరపై.. నెట్టింట దుమారం

Controversy over PV Sindhu’s Saree at Paris Olympics 2024 Opening Ceremony:పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. మనవాళ్లు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది కదా.. ఇప్పుడేంటి? అంటే పీవీ సింధు కట్టిన చీరపై నెట్టింట దుమారం రేగింది. అయితే తను ఫ్లాగ్ బేరర్ గా అరుదైన గౌరవాన్ని అందుకుంది. అయితే ప్రారంభోత్సవంలో మహిళలు కట్టిన చీరలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో భారతీయ సంప్రదాయం ఒట్టిపడేలా తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో  ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ ఈ చీరను రూపొందించారు.


అయితే నెట్టింట వస్తున్న విమర్శలేమిటంటే, చీరపై ఉన్న డిజైన్ గురించి కాదు, అలాగే చీరకట్టిన పీవీ సింధుపై కాదని చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. చీర క్లాత్ చాలా నాసిరకంగా ఉందని, ఇంతటి పల్చటి క్లాత్ పై భారతీయ సంప్రదాయతకు చిహ్నమైన డిజైన్ వేస్తారా? అంతేకాదు.. ప్రపంచమంతా చూసే విశ్వ క్రీడలకు పంపిస్తారా? అని డాక్టర్ నందితా అయ్యర్ విమర్శించారు. ఇంతకీ ఆమె  ప్రముఖ కాలమిస్ట్ గా ఉన్నారు.

అయితే తనేమంటారంటే.. భారతదేశంలో ఎంతో విలువైన పట్టు చీరలున్నాయి. లేదంటే ఆ స్థాయికి తగిన చేనేత వస్త్రాలున్నాయి. ఇంకా రకరకాల విలువైన వస్త్రాలున్నాయి. మన భారతీయ స్త్రీలు వాటిని కట్టుకుంటే ఎంతో హుందాగా ఉంటాయి. మన భారతీయతను ఉట్టిపడేలా ఉండాల్సిన చీర క్లాత్ ను ఎంతో నాసిరకమైనది ఎంపిక చేశారు. నేనెంతో భాదాతప్త హ్రదయంతో చెబుతున్నారు. ఈ రకమైన చీరలు ముంబయి వీధుల్లో రూ.200 కి దొరుకుతాయని అన్నారు.


Also Read: ఒలింపిక్స్ లో.. గురి తప్పిన షూటర్లు

ఇదేనా మన భారతీయ సంప్రదాయతకు మీరిచ్చే గౌరవమని మండిపడ్డారు. ఈ వేడుకల యూనిఫామ్ ని మరింత నాణ్యమైన దుస్తులతో చేయించి ఉంటే, మన విలువ, గౌరవం పెరిగేదని అభిప్రాయ పడ్డారు. ఆ అవకాశాన్ని మీరు పోగొట్టారని తెలిపారు.

మీకు వచ్చిన ఆర్డర్ ని ఖాళీ లేక, డిజైన్ చేసి మరొకరికి అప్పగించారా? అని ప్రశ్నించారు. లేక మనవాళ్లే మీకు కొద్ది సమయం మాత్రమే ఇచ్చి, హడావుడిగా చేయమన్నారా? లేక మీరు డిజైన్ చేసిన తర్వాత ఆ చీర నాణ్యతను చూడకుండా ఎవరు ఓకే చేశారని ప్రశ్నించారు. మీకు లేకపోతే, వారైనా అడగాలి కదాని కడిగిపారేశారు.

ఎంతో సుసంపన్నమైన భారతీయ చేనేత సంస్కృతికి, చరిత్రకు ఇది ఘోరమైన అవమానం’ అంటూ నందితా అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×