Hulk Hogan : సాధారణంగా పలువురు క్రీడాకారులు తమ క్రీడలతో పాటు వ్యక్తిగత విషయాల్లో కూడా వైరల్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో క్రీడల కంటే ఎక్కువ వ్యక్తిగత విషయాల్లో ముఖ్యంగా ఎఫైర్స్.. వేరే వాళ్ల భార్యలతో తిరగడం వంటి చేస్తున్నారు. వారి గురించి నిత్యం సోషల్ మీడియాలో చర్చించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. హల్క్ హోగన్ తన ప్రదర్శన.. WWE ప్రపంచ ఛాంపియన్ షిప్ రెజ్లింగ్ కి తీసుకొచ్చిన శైలితో ప్రసిద్ధి చెందాడు. అతనికి సంబంధించి అత్యంత గొప్ప పోరాటాల్లో ఒక పోరాటం రింగ్ బయట జరిగింది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 2006లో తన స్నేహితుని నుంచి బెదిరింపును ఎదుర్కొన్నాడు. అతను తన స్నేహితుడి భార్యతో ఏకాంతంగా గడిపాడు. దీంతో స్నేహితుడికి రెడ్ హ్యాండెడ్ దొరికాడు.
Also Read : WCL 2025 : మొన్న 41, ఇవాళ 39 బంతుల్లో.. వరస సెంచరీలతో రికార్డు..!
వాస్తవానికి హోగన్ అసలు టెర్రీజీన్ బొల్లియా.. అతను తన స్నేహితుడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తన స్నేహితుడు బుబ్బా ప్రసిద్ది చెందిన రేడియోలో పని చేసేవాడు. అయితే బుబ్బా భార్యతో భహోగన్ ఉన్నట్టు చూపిస్తూ.. అమెరికన్ బ్లాగ్ ద్వారా ఓ క్లిప్ ప్రచురించబడింది. వాస్తవానికి హోగన్ తన రహస్యం పై దాడి చేసినందుకు రేడియో క్లేమ్, గాకర్ ఇద్దరి పై దావా వేశాడు. అతను రెండు కేసుల్లో కూడా విజయం సాధించాడు. ఇక అప్పటి నుంచి బుబ్బా-హోగన్ మధ్య స్నేహం.. శత్రుత్వానికి దారి తీసింది. మల్లయోధుడు రెస్లింగ్ మాత్రం విజయం సాధించాడు. ఇటీవలే హోగన్ 71 ఏళ్ల వయస్సులో మరణించాడు.
తన స్నేహితుని ద్వారానే..
వాస్తవానికి బుబ్బా మరియు హోగన్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. కానీ ప్రసిద్ద బొలియా గాకర్ 2012లో హోగన్ కి సంబంధించి రహస్య వీడియోని చిత్రీకరించి ప్రచురించడంతో అతని స్నేహం విడిపోయింది. వాస్తవానికి పలుమార్లు బుబ్బా తన స్నేహితునికి ఇంటికి పిలిపించుకొని అక్కడే నిద్ర పోవాలని కోరేవాడట. ఆ సమయంలోనే తన స్నేహితుడి భార్యతో చనువు ఏర్పడి రహస్యంగా కలవడం మొదలు పెట్టాడు. దీంతో తన స్నేహితుడు విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఓ ఇంటర్వ్యూలో తన స్నేహితుడు.. అతని భార్య గురించి కూడా చెప్పాడట హోగన్. తన స్నేహితుడు బుబ్బా భార్య హింథర్ తనను టెంప్ట్ చేయడం వల్లనే తనతోో రహస్యంగా గడిపినట్టు వెల్లడించాడు. తాను రహస్యంగా గడిపినట్టు గాకర్ 10 సెకన్ల సమయం వీడియో తీశాడు. అయితే దాంటో రెండు నిమిషాల క్లిప్ ను విడుదల చేశాడు. తనకు తెలియకుండా ఇలా చేశాడని.. అతని పై పరువునష్టం దావా వేసినట్టు తెలిపాడు. ఆ వీడియో కొద్ది రోజులు నెట్టింట్లో వైరల్ అయింది. అందుకే తెలిసో తెలియక తప్పు చేశానని.. వాస్తవానికి తాను తప్పు చేయదలుచుకోలేదని.. తన స్నేహితుని భార్య తనను రెచ్చగొట్టడం వల్లనే అలా జరిగిందని హోగన్ చెప్పుకొచ్చారు. హోగన్ మరణించిన తన స్నేహితుడి భార్యతో గడిపిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.