Watch Video: ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్ స్టాస్ మీ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – భారత్ మధ్య జరిగిన సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత స్టార్ బేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో ఈ యువ ఆటగాడు సామ్ కొన్ స్టాస్ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో గొడవ పడడంతో ఇతడు వార్తల్లోకెక్కాడు.
Also Read: Sitamanshu Kotak: టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్.. ఎవరీ సితాంశు కోటక్ ?
కొన్ స్టాస్ పిచ్ పై నడుస్తుండగా కోహ్లీ వచ్చి అతడి భుజాన్ని ఢీ కట్టడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం తన ఫ్యామిలీ మొత్తం కోహ్లీని ఇష్టపడతామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు కొన్ స్టాస్. మ్యాచ్ అనంతరం తాను విరాట్ కోహ్లీతో మాట్లాడానని.. తనను ఆరాధిస్తానని కోహ్లీతో చెప్పానన్నాడు. కోహ్లీతో కలిసి ఆడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నాడు.
ఇలా ఈ సిరీస్ జరిగిన సమయంలో తరచూ వార్తల్లోకెక్కిన కొన్ స్టాస్.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. కానీ ఈసారి అతడు ఏం చేయలేదు. అతడి కోసం ఓ అభిమాని చేసిన పొరపాటు వల్ల మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. కొన్ స్టాస్ ప్రాక్టీస్ కోసం తన లగేజీతో నడుచుకుంటూ వెళుతుండగా.. అతడి వెనకాలే ఓ కారులో వెళ్తున్న ఓ అభిమాని కొన్ స్టాస్ ని చూశాడు. వెంటనే ఆ కారుని పార్క్ చేసి.. కొన్ స్టాస్ ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తుకెళ్ళాడు.
అయితే ఈ హడావిడిలో ఆ అభిమాని కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు. ఆ ప్రదేశం కాస్త డౌన్ గా ఉండడంతో కారు ముందుకు కదిలింది. కొన్ స్టాస్ ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తిన వ్యక్తి.. తన కారు ముందుకి కదలడం చూసి అలర్ట్ అయ్యాడు. తిరిగి కారు వద్దకు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేలోపే అది ముందు పార్క్ చేసి ఉన్న మరో కారును ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏం జరగలేదు.
Also Read: Kireon Pollard: 900 సిక్సర్లు బాదిన పోలార్డ్.. గేల్ తర్వాత రెండో స్థానం !
కానీ కారు ముందు భాగం కాస్త డ్యామేజ్ అయింది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది..? ఎక్కడ జరిగింది..? అన్నది మాత్రం స్పష్టత లేదు. ఈ ఘటన తర్వాత ఆ అభిమాని కొన్ స్టాస్ ని కలిశాడా..? లేక నిరాశతో అక్కడి నుండి వెళ్లిపోయాడా..? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు కొన్ స్టాస్ ఎఫెక్ట్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
A costly attempt at a photo with Sam Konstas. 🫣 #AUSvIND
(🎥: thunderbbl/IG) pic.twitter.com/mePkJlQ0D3
— Herald Sun Sport (@heraldsunsport) January 15, 2025