BigTV English

Virat Kohli: RCB కోసం యువ జంట రచ్చ.. తిరుమల మెట్లు ఎక్కి మరీ

Virat Kohli:   RCB కోసం యువ జంట రచ్చ.. తిరుమల మెట్లు ఎక్కి మరీ

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… దుమ్ము లేపుతోంది. గతంలో కంటే ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో అద్భుతంగా రాణించి పాయింట్స్ టేబుల్ లో కూడా మూడో స్థానంలో నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అదే ఇప్పటివరకు ఉన్న 10 జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.


Also Read: Dhoni – Abdo Feghani : ధోని క్రేజీ మామూలుగా లేదుగా.. రేసర్ కూడా ఆ జెర్సీ ధరించాడు !

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి కచ్చితంగా కప్పు కొట్టాలని…. ఆ జట్టు అభిమానులందరూ ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఈసారి ఛాంపియన్ కావాలని ఓ జంట.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఏకంగా తిరుమలకు కాలినడకన వెళ్ళింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి కప్పు గెలవాలని… కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది ఈ జంట.


విరాట్ కోహ్లీ జెర్సీ తో భార్యాభర్తలు

ఏపీకి చెందిన ఇద్దరు భార్యాభర్తలు.. విరాట్ కోహ్లీ జెర్సీ 18 వేసుకొని మరి అలిపిరి మార్గం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ…. దీపాలు వెలిగించుకుంటూ తమ మొక్కలను తీర్చుకున్నారు. ఈసారి కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించాలని… వాళ్లు ఈ మొక్కు మొక్కినట్లు చెబుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి కప్పు గెలిస్తే మరోసారి తిరుమలకు వచ్చి… కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటామని చెబుతున్నారు.

పాయింట్స్ టేబుల్ లో దుమ్ము లేపుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్కు సంబంధించిన పాయింట్స్ టేబుల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఆరు మ్యాచ్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల్లోనే ఓడిపోయింది. మొత్తం ఎనిమిది పాయింట్లు దక్కించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి వెళుతుంది. కాగా…. రెండు రోజుల కిందట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి… మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ గెలవడంతో మూడవ స్థానానికి చేరుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

Also Read: PSL – Hair Dryer: సెంచరీ చేస్తే ఆ గిఫ్టులు ఇస్తారా..ఇక షేవింగ్ కిట్ ఇవ్వండిరా

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by ᴠ ɪ ᴄ ᴋ ʏ 🦋 (@always_vv_)

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×