Dance Ikon 2 : ఇటీవల కాలంలో బుల్లితెరపై వచ్చే కొన్ని షోలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. రీసెంట్ గా సుడిగాలి సుధీర్, యాంకర్ రవి కలిసి చేసిన ఓ స్కిట్ తీవ్ర దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘డ్యాన్స్ ఐకాన్ 2’ (Dance Ikon S2) అనే ఓ రియాలిటీ షో కూడా ఇప్పుడు అదేవిధంగా వివాదంలో చిక్కుకుంది. ఓ ఐకానిక్ సాంగ్ కి అడల్ట్ స్టెప్పులు వేసి, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
అసలేం జరిగిందంటే?
‘డ్యాన్స్ ఐకాన్ 2’ అనే డ్యాన్స్ షో ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోకి ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ షో ప్రోమోలో ఓల్డ్ ఐకానిక్ క్లాసిక్ ‘అహ నా పెళ్ళంట’ పాటకి ఓ లేడి కంటెస్టెంట్ డ్యాన్స్ చేసింది. అయితే కొత్తగా చేయాలనే తపనతో ఆమె చేసిన డాన్స్ విమర్శలకు కారణమైంది. “క్లాసిక్ పాటను నాశనం చేస్తున్నారు, ఆ డాన్స్ పరమ అసహ్యంగా, రోతగా ఉంది” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ షోకి గెస్ట్ గా హాజరైన ‘సారంగపాణి జాతకం’ టీంపై కూడా మండిపడుతున్నారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ డాన్స్ చూసి “ఈ పాటకి ఇలా కూడా డ్యాన్స్ చేయొచ్చా… కొత్తగా ఉంది” అంటూ కామెంట్ చేశారు. కానీ “అందులో కొత్తగా ఏముంది అసభ్యత తప్ప” అంటూ ఫైర్ అవుతున్నారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా శేఖర్ మాస్టర్
ఇదివరకు శేఖర్ మాస్టర్ (Sekhar Master) ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి అద్భుతంగా కొరియోగ్రఫీ చేసి శభాష్ అనిపించుకున్నారు. కానీ ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి. ‘దబిడి దిబిడి’ సాంగ్ కి ఊర్వశీ రౌతెల, బాలయ్య కలిసి వేసిన స్టెప్పులు వివాదాస్పదం కావడం, దానికి ముఖ్య కారణమైన శేఖర్ మాస్టర్ పై విమర్శలు రావడం తెలిసిందే. ఇక ఆ తర్వాత ‘రాబిమ్ హుడ్’ సినిమాలోని ‘అదిదా సర్ప్రైజు’ పాటలో కేతికా శర్మ వేసిన స్టెప్పులు కూడా కాంట్రవర్సీకి దారి తీసాయి. ఈ సాంగ్ కు కూడా కొరియోగ్రఫీ శేఖర్ మాస్టరే చేయడం గమనార్హం. ఇక ఈ వివాదాన్ని ఇంకా మర్చిపోక ముందే ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షోలో ఆ లేడీ కంటెస్టెంట్ క్లాసిక్ సాంగ్ ‘అహ నా పెళ్ళంట’కు వేసిన స్టెప్పులపై ట్రోలింగ్ మొదలైంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీనే కాదు ఆయన జడ్జ్ గా వెళ్లే షోలు కూడా అంతే అసభ్యకరంగా తయారయ్యాయి అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.
Read Also : మళ్లీ రిలాక్స్ అవుతున్న యంగ్ టైగర్… మరి ఆ మూడు సినిమాల పరిస్థితేంటయ్యా?
కాగా ‘అహ నా పెళ్ళంట’ సాంగ్ ‘మాయాబజార్’ సినిమాలోనిది. ఈ పాటలో మహానటి సావిత్రి, దివంగత దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు తమ అభినయంతో అదరగొట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి ఒకప్పటి లెజెండరీ స్టార్స్ ఇందులో హీరోలుగా నటించారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1957లో రిలీజ్ అయిన ఈ మూవీకి ఇప్పటికీ టాలీవుడ్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
క్లాసిక్ నాశనం చేస్తా
కొత్త గా ఉంది అంట
పరమ అసహ్యం గా రోత గా ఉంది🤮 pic.twitter.com/KX82VgroK4— ismailbhaii (@atheisttindiann) April 14, 2025