Babloo Prithiveeraj: ఒకప్పుడు నటీనటులకు, ఇప్పటి నటీనటులకు చాలా తేడా ఉంది. అప్పట్లో మేకర్స్ చెప్పినట్టుగానే నటీనటులు వినేవారు. ఇప్పుడు అలా కాదని, యంగ్ యాక్టర్లకు యాటిట్యూడ్ బాగా పెరిగిపోయిందని చాలామంది సీనియర్లు ఇప్పటికే ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి బబ్లూ పృథ్విరాజ్ (Babloo Prithiveeraj) కూడా యాడ్ అయ్యారు. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా గుర్తిండిపోయే సినిమాల్లో నటించిన ఈయన.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి కమ్ బ్యాక్ ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బబ్లూ పృథ్విరాజ్ ఈరోజుల్లో ఏ హీరోకు ఎక్కువ యాటిట్యూడ్ ఉంది అని అడిగిన ప్రశ్నకు టక్కున విశ్వక్ సేన్ అని సమాధానమిచ్చాడు. తర్వాత దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు.
సారీ చెప్పాల్సింది
‘‘విశ్వక్ సేన్ (Vishwak Sen)కు చాలా యాటిట్యూడ్ ఉంది. లైలా సినిమా సమయంలో ఒక అపార్థం జరిగింది. ప్రెస్ అనేది చాలా పవర్‌ఫుల్. వాళ్లను హర్ట్ చేయొద్దు అంటుంటారు. లైలా అనేది మంచి కామెడీ మూవీ. కానీ ప్రెస్ మాత్రం అది చెడ్డ సినిమా అని చెప్పింది. ఇదంతా ఒక్క ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాట్లాడితే క్లియర్ అయిపోయేది. అలా అరేంజ్ చేసినప్పుడు కూడా వారిపై కోపం చూపించాడు, యాటిట్యూడ్ చూపించాడు. చివరికి మనకు ప్రెస్ చాలా అవసరం. వారికి ఎదురు వెళ్లలేం. ఒకసారి సారీ చెప్తే సరిపోలేదు అంటే వందసార్లు సారీ చెప్పాలి. ప్రెస్‌కు సారీ చెప్పడమే కావాలి అంటే అదే చేసి ఉండాల్సింది. కానీ తను చూపించిన యాటిట్యూడ్ మాత్రం తప్పు’’ అని చెప్పుకొచ్చారు బబ్లూ పృథ్విరాజ్.
కాల్ లిఫ్ట్ చేయలేదు
‘‘లైలా సినిమా సమయంలో ఇదంతా జరుగుతున్నప్పుడు నేను తనకు సర్దిచెప్పాలని చూశాను. కానీ తను నా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇది జరిగినప్పుడు నేను తనకు ఫోన్ చేశాను. రింగ్ అయ్యింది, కానీ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నేను కూడా మళ్లీ ఫోన్ చేయలేదు’’ అని అన్నారు పృథ్విరాజ్. అసలు బబ్లూ పృథ్విరాజ్‌ను అందరూ మర్చిపోయిన సమయంలో ఆయన గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. జీవితంలో ఏదో జరుగుతుందని నమ్మకం కోల్పోయిన వారికి ఆయన ధైర్యం చెప్పారు. ‘‘ప్రతీ ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. చెడులో కూడా మంచి వెతుక్కోవాలని నేను నమ్ముతాను’’ అని అన్నారు బబ్లూ పృథ్విరాజ్.
Also Read: హైదరాబాద్‌ను నిర్మించింది ఆయనే.. చంద్రబాబుపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
విలన్‌గా బిజీ
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత బబ్లూ పృథ్విరాజ్ చాలా బిజీ అయిపోయారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో విలన్‌గా కనిపించిన తర్వాత చాలామంది పృథ్విరాజ్‌కు మళ్లీ విలన్ రోల్స్‌నే ఆఫర్ చేస్తున్నారు. ఒకవైపు సీరియస్ విలన్ పాత్రలు మాత్రమే కాకుండా కామెడీ విలన్‌గా కూడా కనిపించి అలరిస్తున్నారు ఈ సీనియర్ నటుడు. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా ఏ భాష సినిమా అని చూడకుండా తన దగ్గరకు వస్తున్న చాలావరకు ఆఫర్లను ఆయన ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం సుహాస్ హీరోగా నటిస్తున్న ‘ఓ భామ అయ్యో రామ’ మూవీలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యారు పృథ్విరాజ్.