BigTV English

Hamza Saleem Dar : బాబోయ్ .. ఇరగ్గొట్టాడు 43 బంతుల్లో 193 పరుగులా?

Hamza Saleem Dar : బాబోయ్ .. ఇరగ్గొట్టాడు 43 బంతుల్లో 193 పరుగులా?

Hamza Saleem Dar : అది ఆటా లేక హాంఫట్ అంటూ చేసిన ఇంద్రజాలమా… అది బ్యాటా లేకపోతే కర్రా బిళ్లానా? బాల్ వేయడం భయం, ఇలా కొడితే అలా సిక్స్…ఇలా కొడితే అలా ఫోర్, ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు కొడితే 36 పరుగులు వస్తాయి. కానీ ఇక్కడ ఒక ఒక ఓవర్ లో… నో బాల్ తో కలిపి, ఏకంగా 43 పరుగులు వచ్చాయి. అంటే ఏడు సిక్స్ లు కొట్టినట్టన్నమాట. బౌలర్లపై జాలి పడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి…


ఇదేమైన టీ 20 మ్యాచ్ అంటే అదీ కూడా కాదు… టీ 10 మ్యాచ్ …అయితే ఇందులోనే ఒక బ్యాటర్ 43 బంతుల్లో 193 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతను సెంచరీని కేవలం 24 బాల్స్ లోనే చేసి పారేశాడు.

ఇదెక్కడ జరిగిందని అనుకుంటున్నారా? యూరోపియన్ క్రికెట్ లీగ్ టీ10 మ్యాచ్ లో జరిగింది. కాటలున్యా జాగ్వార్ వర్సెస్ సోహల్ హాస్పిటల్టెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన జాగ్వార్ టీమ్ 10 ఓవర్లలో 257 పరుగులు చేసింది. అందులో హమ్దా సలీమ్ దార్ 43 బంతుల్లో 193 పరుగులు చేసి వీర విధ్వంసం స్రష్టించాడు.


వచ్చిందా? కొట్టామా? సిక్సర్ వెళ్లిందా? అదే రీతిలో సాగింది. ఇందులో 22 సిక్స్ లు, 14 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీ 10 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన లూయిస్ (163) ను సలీమ్ దార్ అధిగమించాడు.

అనంతరం లక్ష్య చేధనలో సోహాల్ టీమ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 104 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 156 పరుగుల తేడాతో జాగ్వార్ టీమ్ అద్భుత విజయం సాధించింది. ఇదే టీమ్ లో సలీమ్ ధార్ తో పాటు యాసిర్ ఆలీ 19 బంతుల్లో 58 పరుగులు చేయడం విశేషం.

రేపు వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్ మెగా టోర్నమెంటులో ఇప్పుడిలా తుక్కు రేగ్గొడుతున్న లోకల్ జట్లన్నీ వస్తే మన పెద్ద జట్ల పరిస్థితేమిటి? అని అభిమానులు అప్పుడే ఆలోచనలు చేస్తున్నారు.

ఇంతవరకు ఆ ఎనిమిది లేదా 10 జట్ల మధ్యే దశాబ్దాల తరబడి మ్యాచ్ లు జరుగుతున్నాయి. దీంతో ఎంత ఆడినా వాళ్ల మధ్యే పోటీ ఉండేది. అది ఆరోగ్యకరంగా ఉండేది. కానీ ఇప్పుడు జంతర్ మంతర్ టీమ్ లన్నీ వస్తున్నాయి. వాళ్లతో ఆడి పరువు పోగొట్టుకోరు కదా అనే సందేహాలు మరో వైపు నుంచి అప్పుడే వినిపిస్తున్నాయి. అప్పుడు మన వీర క్రికెటర్ల బండారం బయటపడదు కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

.

.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×