BigTV English

MLC Resignations : తెలంగాణలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు.. ఆమోదించిన మండలి ఛైర్మన్

MLC Resignations : తెలంగాణలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు.. ఆమోదించిన మండలి ఛైర్మన్

MLC Resignations : తెలంగాణలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్సీలుగా రాజీనామాలు చేసి.. వాటిని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సమర్పించారు. వాటిని ఆయన ఆమోదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. జనగాం ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి, హుజురాబాద్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలవడంతో.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు.


శనివారం తెలంగాణ కొత్త శాసనసభ కొలువుదీరగా.. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారాలు చేయించారు. తొలుత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేయగా.. ఆ తర్వాత భట్టివిక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు గాంధీభవన్ లో సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 78 కేజీల కేక్ ను మాజీ పీసీసీ సభ్యులు వీహెచ్ తో సీఎం రేవంత్ కేక్ కట్ చేయించారు. సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×