Watch Video : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక గల్లీ క్రికెట్ లో రకరకాల స్టైల్ లో క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు విన్నాం. కొన్ని వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బౌలర్ తిప్పి తిప్పి.. రివర్స్ బంతి వేస్తే.. బౌల్డ్ కావడం.. రివర్స్ లో బ్యాటింగ్ చేసి ఫోర్, సిక్స్ బాదడం.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి మంచి క్రేజ్ లభిస్తోంది. ఇది వరకు క్రికెట్ ఆడని దేశాలు కూడా ప్రస్తుతం క్రికెట్ పై ఆసక్తి కనబరచడం విశేషం. టీమిండియా క్రికెట్ లో ప్రపంచ వ్యాప్తంగా దూసుకెళ్లుతోంది. ఇక ఇందుకు కారణం గల్లీ క్రికెట్ అనే చెప్పాలి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : Blinkit Delivery Boy : దారిన వెళ్లే డెలివరీ బాయ్ తో క్రికెట్… బయట తిరిగే వాడిని పిలిచి మరి బ్యాటింగ్ !
బుడ్డోడి దెబ్బ.. ఎగిరి పడ్డ వికెట్..
ముఖ్యంగా ఓ గల్లీ క్రికెట్ లో పిల్లలు పొలాల గట్ల వద్ద క్రికెట్ ఆడుతున్నారు. ఈ సందర్భంలో ఓ చిన్నోడు శరవేగంగా బంతిని విసిరేశాడు. ఆ బంతి వైడ్ యార్కర్ గా పడింది. మరో బుడ్డోడు బ్యాటింగ్ చేస్తూ.. బంతి లెగ్ సైడ్ వెళ్తుందని ఆ బంతిని వదిలేస్తాడు. కానీ ఆ బంతికి శరవేగంగా దూసుకొచ్చి అతని నడ్డికి తాకి.. అదేవేగంతో వికెట్ కి తాకింది. దీంతో వికెట్ ఎగిరి అవుతల పడుతుంది. అలాగే బ్యాటింగ్ చేసే బుడ్డోడు కూడా బ్యాట్ తో పాటు కింద పడిపోతాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ కావడం విశేషం. సోషల్ మీడియాలో గల్లీ క్రికెట్ కి సంబంధించిన వీడియోలు రకరకాలుగా కనిపించడం.. అవి చూసిన నెటిజన్లు వాటిని పోస్ట్ చేయడం.. షేర్ చేయడం అవి వైరల్ కావడం సర్వసాధారణం అయిపోయింది.
క్రికెట్ కి క్రేజీ..
ఇక ప్రధానంగా ఇండియాలో క్రికెట్ కి బాగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఆడినట్టు ఏ దేశంలో కూడా గల్లీ క్రికెట్ ఆడరు. ప్రతీ రాష్ట్రంలో పంట పొలాల వద్ద.. గల్లీల వద్ద, చిన్న చిన్న మైదానాల్లో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. కొందరూ పండుగ వేళలో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఆ క్రికెట్ లో రకరకాల బంతులను వినియోగిస్తారు. కొందరూ రబ్బర్ బంతిని, కొందరూ టెన్నిస్, కొందరూ కార్క్.. మరికొందరూ గ్రేస్ బాల్ ని ఇలా రకరకాలుగా క్రికెట్ బంతిని ఉపయోగించి ఆడుతుంటారు. ఇలా గల్లీ క్రికెట్ ఆడటం.. అక్కడి నుంచి మండల స్థాయి.. డివిజన్ స్థాయి.. డిస్ట్రిక్ లేవల్ తో పాటు స్టేట్ లేవల్ లో ఫేమస్ అయిన వారు రంజీ మ్యాచ్ ల్లో.. రాణిస్తుంటారు.ఇండియాలో అయితే ఐపీఎల్ కి కూడా అవకాశాలు రావడం.. ఐపీఎల్ లో రాణిస్తే.. అక్కడి నుంచి టీమ్ ఇండియా కి ఆడే అవకాశాలు వస్తుంటాయి. ఇలా చాలా మంది టీమిండియా క్రికెట్ లో రాణించిన వారు కూడా ఉండటం విశేషం.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 9, 2025