Watch Video : సాధారణంగా క్రికెట్ (Cricket) లో రక రకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంత మంది అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. మరికొందరూ అద్భుతంగా బ్యాటింగ్ (Bating) చేస్తారు. మరి కొంత మంది డైవ్ చేసి మరీ ఫీల్డింగ్ చేస్తుంటారు. ఎంత మంచి బౌలర్లు అయినా.. ఎంత మంచి బ్యాటర్లు అయినా.. ఎంత మంది ఫీల్డర్లు అయినా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరగడం సహజమే. అది గల్లీ క్రికెట్ లో అయినా.. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అయినా.. అండర్ – 19 అయినా ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం. తాజాగా ఓ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. అస్సలు అది క్రికెట్ బంతినా..? లేక వాలీబాలా అనేది గుర్తు పట్టకుండా ఉండటం ఒకఎత్తు అయితే.. మరోవైపు ఆ వీడియో ని చూసి షాక్ అవుతున్నారు.
బకెట్ తో వెరైటీ క్యాచ్..
వాలీబాల్ మాదిరిగా ఉన్న బంతిని బౌలర్ విసిరివేయగానే.. బ్యాట్స్ మెన్ ఆ బంతిని బౌండరీ వెలుపలకు బాదాడు. దీంతో ఆ బంతి చాలా పైకి వెళ్లడంతో.. బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్ బంతిని అందుకోవడం కోసం అక్కడ ఉన్న ఒక వ్యక్తి వద్ద కర్ర.. మరో వ్యక్తి మొహం కడుక్కుంటుండగా అతని బకెట్ తీసుకొచ్చి.. ఆ కర్రకు-బకెట్ కి తాడుతో కట్టాడు. బౌండరీ ఇవతల ఉండి.. బౌండరీ అవతల పడుతున్న బంతిని బకెట్ తో పట్టాడు. పట్టి ఔట్ అని గ్రౌండ్ లోకి బకెట్ ని తీసుకొచ్చాడు. దీంతో బ్యాట్స్ మెన్ ఆశ్చర్యకరంగా చూస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వారు ఆడింది.. క్రికెటా..? లేక వాలీబాలా..? ఆటను ఇలా కూడా కూడా ఆడుతారా..? ఇలాంటి ఆటను నెనెప్పుడు చూడలేదయ్యా సామి.. బకెట్ తో క్యాచ్ లు పట్టడమేంట్రా బాబు.. అంటూ కామెంట్స్ చేయడం విశేషం.
ఆశ్యర్యపోయిన ఆటగాళ్లు..
ముఖ్యంగా ఇలాంటి వీడియోలు(Videos) సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతుండటం విశేషం. మరోవైపు ఇటీవలే ఓవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అదేంటంటే..? గల్లీ క్రికెట్ లో బౌలర్ విసిరిన బంతిని బ్యాటర్ బాదగా.. అది పైకి క్యాచ్ లేసింది. అయితే ఆ బంతికి బౌలర్ క్యాచ్ పట్టాడని.. బ్యాటర్ ఆవేశంగా బ్యాట్ ని కింద కొట్టడంతో బ్యాట్ (Bat) విరిగిపోతుంది. కానీ బౌలర్ క్యాచ్ ని మిస్ చేస్తాడు. ఇక బ్యాట్స్ మెన్ రన్ తీయకుండా వెనుదిరగడంతో బౌలర్ (Bowler) సింపుల్ గా బంతిని వికెట్ల వద్దకు తీసుకెళ్లి తాకిస్తాడు. అప్పుడు బ్యాట్స్ మెన్ ఆశ్యర్యకరంగా చూస్తుంటాడు. అస్సలు నేను రన్ తీసి ఉండాల్సింది.. ఇలా చేశానేంట్రా అన్నట్టుగా.. తాజాగా ఫీల్డర్ బంతిని పట్టగానే.. బ్యాట్స్ మెన్ కూడా అలాగే ఆశ్యర్యపోవడం విశేషం.
?igsh=MTlxaDl1dm92am9pcg==