Big Stories

Prithvi Shaw: మరో వివాదంలో చిక్కుకున్న పృథ్వీ షా

Prithvi Shaw: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా. అనేక సార్లు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలిచిన ఈ ఆటగాడు.. మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు. సెల్ఫీల కోసం కొందరు వ్యక్తులు పృథ్వీ షా, అతని స్నేహితునిపై దాడి చేసిన విషయం తెలిసిందే. సెల్ఫీ ఇవ్వకపోవడంతో వారి కారుపై బేస్‌బ్యాల్ బ్యాట్‌తో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 8 మందిపై కేసు కూడా నమోదు అయింది. అయితే పృథ్వీ షా, అతని స్నేహితుడే మద్యం మత్తులో తమపై దాడి చేశారని నిందితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమవుతోంది.

- Advertisement -

గతంలో కూడా పృథ్వీ షా డోపింగ్ టెస్టులో పట్టుబడి నిషేధానికి గురయ్యారు. 2019లో ఓ టోర్నీ సమయంలో పృథ్వీ షా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో 8 నెలల పాటు అతడిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పృథ్వీ దానిపై వివరణ ఇచ్చారు. తన ఆరోగ్యం బాగోలేకపోతే మార్కెట్లో దొరికే మందులు వేసుకున్నానని, అందుకే టెస్టులో పాజిటీవ్ వచ్చిందని వెల్లడించారు.

- Advertisement -

అలాగే 2022లో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్లేయర్లకు యో-యో టెస్ట్ నిర్వహించగా.. అందులో షా ఫెయిలయ్యాడు. ఆ టెస్టులో మినిమం 16.5 స్కోరు సాధించాల్సి ఉండగా… పృథ్వీ కేవలం 15 కంటె తక్కువ స్కోర్ సాధించి విమర్శల పాలయ్యారు. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News