Rishabh Pant: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా…. టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే… ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత టీమిండియా క్రికెటర్లందరూ దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఛాంపియన్గా నిలిచిన టీమిండియా… ఆ తర్వాత దుబాయ్ నుంచి బయలుదేరింది. టీమిండియా క్రికెటర్లు అందరూ తమ తమ ఇంటికి వెళ్ళిపోయారు.
Also Read: Jio Hotstar – IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు జియో అదిరిపోయే శుభవార్త.. ఇకపై రూ.100 లకే
ఈ నేపథ్యంలోనే టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం… పెళ్లికి వెళ్ళాడు. తన సోదరి పెళ్లికి రిషబ్ పంత్ తాజాగా అటెండ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ టీ షర్ట్ పైన మెరిసిన రిషబ్ పంత్… స్టెప్పులు కూడా వేశాడు. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోక ముందే… నైట్ డ్రెస్ అయిన షార్ట్ పైన ఉన్న రిషబ్ పంత్… అక్కడ ఉన్న తమ కుటుంబ సభ్యులతో తీన్మార్ స్టెప్పులు వేశాడు. తాజాగా రిషబ్ పంత్ సోదరి వివాహం.. ఢిల్లీలో జరిగినట్లు తెలుస్తోంది.
అయితే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చిన రిషబ్ పంత్ నేరుగా… వివాహ వేడుకకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లకుండా నేరుగా పెళ్లికి వెళ్లి అక్కడ రచ్చ రచ్చ చేశాడట. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు కూడా వైరల్ గా మారాయి. మరో రెండు రోజులపాటు… ఢిల్లీలోనే… ఈ పెళ్లి వేడుకలో రిషబ్ పంత్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా…. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. రిషబ్ పంత్ ను సెలెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టులో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. టీమిండియా కు బ్యాకప్ వికెట్ కీపర్ గా రిషబ్ పంతును… భారత్ క్రికెట్ నియంత్రణ మండలి సెలెక్ట్ చేసింది. కానీ తుది జట్టులో మాత్రం చాంపియన్స్ ట్రోఫీలో.. ఆడే ఛాన్సు రిషబ్ పంత్ కు రాలేదు.
కె ఎల్ రాహుల్ సేవలు… టీమిండియా కు ముఖ్యమని గౌతమ్ గంభీర్ ఈ టోర్నమెంట్ కంటే ముందే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో… టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు జట్టులో ఛాన్స్ రాలేదు. వాస్తవంగా టి20 లకు అయితే రిషబ్ పంత్ సరిగ్గా సరిపోతాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ మాత్రం వన్డే ఫార్మాట్లో జరిగింది. కాబట్టి ఆచితూచి ఆడాల్సిన ప్లేయర్ కేఎల్ రాహుల్ అని గ్రహించారు. ఒకవేళ రాహుల్ దారుణంగా విఫలమై ఉంటే పంత్ కు ఛాన్స్ వచ్చేది. కాని కె ఎల్ రాహుల్ ప్రతి మ్యాచ్లో దుమ్ము లేపాడు. ఏదేమైనా టీమిండియా మాత్రం ఛాంపియన్ టోపీ 2025 టోర్నమెంటులో.. విజేతగా నిలవడం జరిగింది. త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో రిషబ్ పంత్ ఆడబోతున్నాడు. ఈసారి లక్నో కెప్టెన్ గా… బరిలోకి దిగబోతున్నాడు రిషబ్ పంత్.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">