Shreyas Iyer: ఛాంపియన్ టోపీ 2025 టోర్నమెంటులో ( Champions Trophy 2025 Tournament )అద్భుతంగా రాణించిన టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం పైన… సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ బాంబు పేల్చాడు. కోల్‌కాతా నైట్ రైడర్స్ జట్టులో ( Kolkata Knight Riders ) తనకు సరైన ప్రాధాన్యత లభించలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్.
Also Read: Jio Hotstar – IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు జియో అదిరిపోయే శుభవార్త.. ఇకపై రూ.100 లకే
చాంపియన్స్ టోపీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… అనుకోకుండా జట్టులోకి వచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఇక వచ్చిన చాన్సును ఏమాత్రం వదులుకోలేదు శ్రేయస్ అయ్యర్. టీమిండియా చాంపియన్గా నిలవడంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర దాదాపు 40 శాతం ఉందని చెప్పవచ్చు. శ్రేయస్ అయ్యర్ తుది జట్టులో లేకపోతే చాంపియన్స్ ట్రోఫీ మనకు వచ్చేదే కాదని చెప్పవచ్చు. ప్రతి మ్యాచ్లో అద్భుతంగా ఆడి దుమ్ము లేపాడు శ్రేయస్ అయ్యర్. ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అందరూ ఇండియాకు వచ్చేశారు.
ఇండియాకు వచ్చిన తర్వాత టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కాతా నైట్ రైడర్స్ జట్టును చాంపియన్గా నిలిచినా కూడా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ జట్టులో తనకు సరైన గుర్తింపు దక్కలేదని… అందుకే బయటకు రావడం జరిగిందని తెలిపాడు. మనం జట్టు కోసం ఎంత కష్టపడ్డా కూడా కొన్నిసార్లు అది… వృధాగా మారిపోతుందని కూడా బాంబు పేల్చాడు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు కొంతమంది మాత్రమే అండగా ఉన్నారని వివరించాడు. గతంలో టీమిండియా జట్టులో ఛాన్స్ కోల్పోవడం జరిగిందన్నాడు. అదే సమయంలో సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు శ్రేయస్ అయ్యర్.
Also Read: KL Rahul: ఏం గుండె రా అది… ఐపీఎల్ 2025 కంటే ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం ?
ఇలాంటి కష్ట కాలంలో కొంతమంది మాత్రమే.. తనకు అండగా నిలిచారన్నాడు. ఇక ఈ సమయంలోనే తనను తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డానని.. సక్సెస్ బాటలో ఇప్పుడు నడుస్తున్నట్లు పేర్కొన్నాడు శ్రేయస్ అయ్యర్. ఇది ఇలా ఉండగా…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( Indian Premier League 2025 ) టోర్నమెంట్ మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 26.75 కోట్లకు… మొదటి మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. భారీ రేటు పెట్టడమే కాకుండా పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అయ్యర్ కు అప్పగించింది పంజాబ్ యాజమాన్యం. ఇది ఇలా ఉండగా…. ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోనే పంజాబ్ కింగ్స్ జట్టు బరిలోకి దిగబోతుంది. మరి అయ్యర్ వచ్చాక అయినా పంజాబ్ కప్పు గెలుస్తుందా అని చూడాలి.