MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానులకు ఊహించని దెబ్బ తగిలింది. మహేంద్ర సింగ్ ధోని కాలికి గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న లక్నో సూపర్ జెంట్స్ జట్టుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ ఆనందంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మహేంద్ర సింగ్ ధోనీ కి తాజాగా గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Virat Kohli: RCB కోసం యువ జంట రచ్చ.. తిరుమల మెట్లు ఎక్కి మరీ
ధోని కాలికి గాయం ?
లక్నోతో మ్యాచ్ పూర్తయిన తర్వాత తిరిగి… ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది చెన్నై సూపర్ కింగ్స్ టీం. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని ఎయిర్ పోర్టులో కాస్త మెల్లగా నడిచాడు. కాలికి దెబ్బ తగిలితే ఇలా నడుస్తారో… అలా నడిచాడు మహేంద్ర సింగ్ ధోని. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన మహేంద్ర సింగ్ ధోని అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోనీకి గాయమైందని…. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అందుకే కాస్త ఇంజురీ అయిన ప్లేయర్ లాగా నడుస్తున్నాడని… సోషల్ మీడియాలో ధోని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు మహేంద్ర సింగ్ ధోనికి ఏమైంది? ఎందుకు అలా నడుస్తున్నాడు ? అసలు ఈ టోర్నమెంట్ ఆడతాడా లేదా ? అని కూడా చర్చిస్తున్నారు.
లక్నో ను చిత్తు చేసిన ధోని టీం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (Indian Premier League 2025 Tournament ) భాగంగా సోమవారం లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( Lucknow Super Giants vs Chennai Super Kings Teams ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెంట్స్ జట్టును చిత్తు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఏకంగా ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెంట్స్ జట్టు పైన విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోని… చివరి వరకు అద్భుతంగా రాణించి జట్టును గెలిపించుకున్నాడు.
దూబే మహేంద్రసింగ్ ధోని అద్భుత ఇన్నింగ్స్
లక్నో మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని అలాగే శివం దుబే చివర్లో అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో శివం దుబే 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని కూడా 11 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు బౌండరీలతో పాటు ఒక సిక్సర్ ఉంది.
Also Read: Dhoni – Abdo Feghani : ధోని క్రేజీ మామూలుగా లేదుగా.. రేసర్ కూడా ఆ జెర్సీ ధరించాడు !
— CSK Korner™ (@dhonsim140024) April 15, 2025