RCB For Sale: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గెలవడం ఏమో గాని… ఏ జట్టుకు రాని కష్టాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు… వచ్చాయి. మొదట తొక్కిసలాట, ఆ తర్వాత వరుస కేసులు, బెంగళూరు పై బ్యాన్, లేదు లేదు మొత్తం జట్టునే అమ్మేస్తున్నారు అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ దెబ్బకు అసలు… మేమెందుకు టైటిల్ గెలిచామో అంటూ రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు అభిమానులు ఆందోళన కూడా వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
బెంగళూరు జట్టును అమ్మేయడం ఖాయం?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలవడంతో… దేశవ్యాప్తంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు పండగ చేసుకున్నారు. టపాకాయలు, బ్యాండు భాజాలతో సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే టైటిల్ గెలిచిన మరుసటి రోజు అంటే బుధవారం రోజున… బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర భారీ పరేడ్ నిర్వహించింది బెంగళూరు యాజమాన్యం. అయితే.. బెంగళూరు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి మరి ఈ పరేడ్ కోసం పర్మిషన్ తీసుకున్నారట.
అయితే ఆ ఒత్తిడి తీసుకురావడం ఇప్పుడు బెంగళూరు జట్టుకు కొత్త చిక్కులు తీసుకువచ్చింది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర 3 లక్షల మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పిపోయింది. ఈ నేపథ్యంలోనే తొక్కి సలాట జరిగింది. ఇంకేముంది.. 11 మంది మరణించగా 33 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా తమ బాధ్యత ఏది కాదని చేతులెత్తేసింది. బాధ్యులపై కేసులు పెడుతూ వరుసగా అరెస్టులు కూడా చేస్తుంది కర్ణాటక సర్కారు. ఇలాంటి నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై మూడు సంవత్సరాల పాటు బ్యాన్ విధిస్తారని చెబుతున్నారు.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు
డీకే శివకుమార్ కూతురు చేతికి బెంగళూరు?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై మూడు సంవత్సరాల బ్యాన్ విధిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే… ఆ జట్టును అమ్మేస్తారని కూడా కొంతమంది చెబుతున్నారు. కొనుగోలు చేసేందుకు ముకేశ్ అంబానీ కొడుకు, కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లైన్లో ఉన్నట్లు కూడా సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు… డీకే శివకుమార్ కూతురు పేరు తెరపైకి వస్తోంది. నేరుగా డీకే శివకుమార్ కొనుగోలు చేస్తే.. ఆయనకు రాజకీయపరంగా చిక్కులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తన కూతురు చేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేయించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ కొనుగోలు చేస్తే 1700 కోట్లు… ఖర్చు చేయాల్సి ఉంటుంది.