CM Chadnrababu: నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఎప్పుడు అందుకోనున్నారు? ఇంకా సమయం ఉందా? కూటమి పాలన ఏడాది సందర్భంగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఏమన్నారు? ఇంకా సమయం పడుతుందా? నేతలు, కార్యకర్తలు మాత్రం చినబాబుకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా పలు ఛానెళ్లకు సీఎం చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడాది సందర్భంగా పాలనతోపాటు పార్టీ గురించి, రాబోయే చేయబోయేవాటి గురించి మనసులోని మాట బయటపెట్టారు. అన్నింటికంటే ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాల్సిందేనని ఓ వైపు నేతలు, మరోవైపు కేడర్ ఒకటే రీసౌండ్.
పార్టీలో లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి క్రమంగా పెరుగుతోంది. కడపలో జరిగిన మహానాడు వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చినబాబును నియమిస్తారని నేతలు భావించారు. కానీ సీఎం చంద్రబాబు ఆ విషయాన్ని పక్కనపెడుతూ వచ్చారు. తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా లోకేష్ అంశం ప్రస్తావనకు వస్తోంది.
ఏపీలో కూటమి పాలన ఏడాది సందర్భంగా సీఎం చంద్రబాబు పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. లోకేష్ విషయంలో ఆకస్తికరమైన సమాధానం ఇచ్చారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. లోకేశ్ విషయంలో పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెప్పకనే చెప్పారు.
ALSO READ: ఏపీలో తల్లికి వందనం స్కీమ్.. ఏ ఒక్కటి తగ్గినా నో మనీ
పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, ఎప్పుడు యువతకు పెద్దపీట వేస్తామన్నారు. పార్టీలో ఎప్పుడూ యువరక్తం ఉండాలని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో లేనంత ఎక్కువమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మా పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్‌లో అతి పిన్నవయస్సు మంత్రి మా పార్టీ నుంచి ఉన్నారన్న విషయాన్ని ప్రధానంగా గుర్తు చేశారు.
రాష్ట్ర మంత్రివర్గంలో చాలామంది యువకులు ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో యువకులు, చదువుకున్నవారిని ప్రొత్సహిస్తామని వెల్లడించారు. కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ పని చేస్తున్నారని ప్రశంసించారు. పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
సీఎ చంద్రబాబు మాటలను గమనించిన ఆ పార్టీ సీనియర్లు.. మరో ఏడాది సమయం పట్టవచ్చని అంటున్నారు. తొలి ఏడాది పాలనలో ప్రబుత్వంలోని లోపాలను సరిదుద్ది గాడిలో పెట్టారని అంటున్నారు. ఇకపై సీఎం చంద్రబాబు పరిపాలనపై దృష్టి సారిస్తే, లోకేష్ పార్టీ పగ్గాలు అందుకోవడం ఖాయమని అంటున్నారు.