E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజం పెద్ద సెల్ఫీష్ ప్లేయ‌ర్…అబ్బాస్, మ‌సూద్ ల‌ను తొక్కేసి మ‌రీ

బాబ‌ర్ ఆజం పెద్ద సెల్ఫీష్ ప్లేయ‌ర్…అబ్బాస్, మ‌సూద్ ల‌ను తొక్కేసి మ‌రీ
Advertisement

Danish Kaneria On Babar Azam:  పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్… మొదటి టెస్టులో 90 పరుగులు తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్రియన్ లారా స్టేడియం వేదికగా జూలై 25వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో నేపథ్యంలో కొత్త కెప్టెన్ వచ్చిన పాకిస్తాన్ తలరాత మారలేదు. మళ్లీ అదే ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ కొత్త కెప్టెన్ బాబర్ ఆజం బ్యాటింగ్ విధానం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతని చెత్త బ్యాటింగ్ కారణంగానే పాకిస్తాన్ ఓడిపోయిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

బాబ‌ర్ ఆజం పెద్ద సెల్ఫీష్ ప్లేయ‌ర్…సింగిల్స్ తీసి ఉంటే పాక్ గెలిచేది

Advertisement

ఈ లిస్టులో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ( Danish Kaneria) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం పెద్ద సెల్ఫిష్ అంటూ ఫైర్ అయ్యారు. తన స్వార్థం కోసం మాత్రమే, బ్యాటింగ్ చేస్తాడని బాంబు పేల్చారు. అందుకే వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సందర్భంగా సింగిల్స్ తీయకుండా.. స్ట్రైకింగ్ కోసం మాత్రమే ప్రయత్నం చేశాడని ఆగ్రహించారు. అలాకాకుండా సింగిల్స్ తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. దీంతో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

Advertisement

వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జులై 25వ తేదీన తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 311, 181 పరుగులు చేసింది. అదే సమయంలో బాబర్ ఆజం సేన 282, 120 పరుగులు సాధించగలిగింది. రెండు ఇన్నింగ్స్ లలో చిత్త ప్రదర్శన కనపరిచిన పాకిస్తాన్… 90 పరుగులు తీయడంతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో 20కి పైగా పరుగులు చేసిన బాబర్ ఆజం, రెండో ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ నమోదు చేసుకొని నాట్ అవుట్ గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్ లో ఇతర బ్యాటర్లు బాబర్ కు సరిగ్గా సహకరించలేదు. దీంతో వరుసగా వికెట్లు పడిపోయాయి. అయితే చివరలో మహమ్మద్ అబ్బాస్, ఒక్కడే బాబర్ కు సపోర్ట్ గా నిలిచాడు.

మహమ్మద్ అబ్బాస్, మ‌సూద్ ల‌ను తొక్కేసిన బాబ‌ర్

ఈ క్రమంలోనే మహమ్మద్ అబ్బాస్ 23 పరుగులు సాధించాడు. ఒకానొక సమయంలో బాబర్ ఆజం కంటే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఈ విషయాన్ని గ్రహించని బాబర్ ఆజం, అతడికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా చివరి బంతికి సింగిల్స్ తీసుకునేవాడు. ఆ తర్వాత ప్రతి బంతి బౌండరీ కోసం మాత్రమే ట్రై చేశాడు బాబర్. ఈ క్రమంలో సింగిల్స్ ఎక్కువ రాలేదు. బాబర్ మొత్తం స్ట్రైకింగ్ తీసుకున్నాడు. దీని ఫలితంగా 90 పరుగులు తేడాతో ఓడిపోవలసి వచ్చింది. ఇదే విషయాన్ని కనేరియా చెప్పే ప్రయత్నం చేశాడు. చిట్టచివర బ్యాటింగ్ కు దిగిన అబ్బాస్ అద్భుతంగా రాణించినా, అతడికి స్ట్రైకింగ్ ఇవ్వకపోవడం దారుణమని ఆయన ఫైర్ అయ్యారు.

ఎప్పటికప్పుడు మొహమ్మద్ అబ్బాస్ కు స్ట్రైక్ ఇస్తే… పాకిస్తాన్ గెలిచేదని వివరించారు. అలాగే షాన్ మసూద్ విషయంలో కూడా బాబర్ తప్పు చేశాడని ఫైర్ అయ్యారు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన షాన్ మసూద్ ను రెండో ఇన్నింగ్స్ లో ఎనిమిదవ వికెట్ కు ఎక్కించడం చాలా దారుణం అన్నారు. అతని కాస్త ముందుగా పంపించి ఉంటే ఫలితం మారిపోయేదని సూచనలు చేశారు. త‌న‌కే పేరు రావాల‌న్న క‌సితో, షాన్ మ‌సూద్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చిన‌ట్లు ఆగ్ర‌హించారు క‌నేరియా. సెల్ఫీష్ లాగా బాబ‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డ‌మే పాక్ కొంప‌ముంచింద‌న్నారు.

Related News

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

Big Stories

Advertisement
×