E-Paper
Advertisement

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !
Advertisement

Darren Sammy On IND VS WI Flats Tracks : టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టి20 సిరీస్ జరుగుతున్న క్రమంలో విండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత గడ్డపై టీమిండియాను ఓడించడం కష్టమేనని చేతులెత్తేశారు. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయామని… టి20 సిరీస్ పైన తనకు నమ్మకం లేదని బాంబు పేల్చారు. ఇండియాలో ఫ్లాట్ ట్రాక్స్ ఉన్నాయని దీనివల్ల తమ ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదని వెల్లడించారు. ఫ్లాట్ ట్రాక్స్ పైన టీమిండియా క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారని… సిక్సర్లు, బౌండరీలు సాధించి చుక్కలు చూపిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎలాగైనా టీమిండియాను ఓడించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని… కానీ వాళ్లను అందుకోలేకపోతున్నామని డారెన్ సమీ వివరించారు.

భారత గడ్డపై టీమిండియాను ఓడించడం కష్టమే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం భారతదేశంలో ఉన్న మైదానాలు మొత్తం ఫ్లాట్ ట్రాక్స్ గా మారాయని డారెన్ సమీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి అలవాటైన టీమ్ ఇండియా క్రికెటర్లు ఇరగదీస్తున్నారని బాంబు పేల్చారు. ఇలాగే ఫ్లాట్ ట్రాక్స్ ఉంటే టీమిండియాను ఓడించడం కష్టమేనన్నారు. పరోక్షంగా టీమిండియా ప్లేయర్లను కూడా విమర్శలు చేశారు. భారతదేశంలో తప్ప వీళ్ళు విదేశీ గడ్డలపై ఆడబోరని పరువు తీసే ప్రయత్నం చేశారు. అదే వెస్టిండీస్ గడ్డపై టీమిండియా అడుగుపెడితే చిత్తు చిత్తుగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

ఈ ఫ్లాట్ ట్రాక్స్ పైన ఆడి 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా క్రికెటర్లు ఎలా రాణిస్తారు అనేది పెద్ద సవాలే అని డేంజర్ బెల్స్ పంపించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఎక్కువ పరుగులు రావాలని.. జనాలను ఎంటర్టైన్ చేయాలని ఉద్దేశంతో టీమిండియా క్రికెట్ ను నాశనం చేస్తున్నారని పరోక్షంగా విమర్శలు చేశారు. దీంతో డారెన్ సమీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

వెస్టిండీస్ పై టీమిండియా ఆధిపత్యం

Advertisement

టీమిడియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మొన్నటి వరకు వన్డే సిరీస్ జరిగింది. ఈ వన్డే సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా దక్కించుకుంది. ఇటు ఐదు టి20 సిరీస్ లో కూడా శుభ్రం చేసింది టీమిండియా. లక్నో వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ అందుకుంది. ఇక టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మరో నాలుగు టి20 లు జరగనున్నాయి. రేపు రెండో టి20 రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది.  వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గా గిల్ వ్యవహరించాడు.  ఇటు టి20 సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

నో డౌట్..టీమిండియానే నెంబ‌ర్ వ‌న్, వాళ్ల‌ను కొట్ట‌డం మా వ‌ల్ల కావ‌డం లేదు!

70 కోట్ల భారతీయులు…ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు అసలు చూడటమే లేదు

ఆ దరిద్రుడు పోయాడు..ఇక టీమిండియాకు అన్ని మంచి రోజులే

కష్టకాలంలో కోహ్లీకి అండగా బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసింది

కుల్దీప్ యాదవ్ కంటే నేనే తోపు..కానీ, నన్నే తొక్కేశారు !

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ…తల పట్టుకుంటోన్న RCB యాజమాన్యం ?

స్మృతి మంధానతో గొడ‌వ‌లు…హర్మన్‌ప్రీత్ కౌర్ తో బ‌ల‌వంత‌పు రాజీనామా ?

Big Stories

Advertisement
×