ఎయిర్ ఇండియాపై డేవిడ్ వార్నర్ ఆగ్రహం:
David Warner: ఇటీవల కాలంలో విమానయాన సంస్థల సేవల లోపాలపై సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ {David Warner} కూడా ఎయిర్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ కి డేవిడ్ వార్నర్ వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యం అయ్యింది.
Also Read: RCB- Mallya: RCB ఫస్ట్ విక్టరీ… విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు!
దీంతో సోషల్ మీడియా వేదికగా వార్నర్ ఎయిర్ ఇండియాపై ఫైర్ అయ్యారు. ఎక్స్ {ట్విట్టర్} వేదికగా.. “పైలట్ ఆలస్యంగా వస్తున్నాడని తెలిసి కూడా గంట ముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారు. పైలెట్ లేని విమానంలో గంట పాటు ఎదురు చూడాలా..? ” అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వార్నర్ ట్వీట్ పై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ ఆలస్యానికి కారణం.. బెంగళూరులో ప్రతికూల వాతావరణ పరిస్థితులేనని పేర్కొంది.
వాతావరణ సమస్యల కారణంగా అన్ని విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాల మళ్లింపులు, ఆలస్యాలను ఎదుర్కొన్నాయని పేర్కొంది. ఈ కారణంగానే ఆ ఫ్లైట్ కి కేటాయించిన సిబ్బంది మరో పనిలో బిజీగా ఉన్నారని, ఇది మరింత ఆలస్యానికి దారి తీసిందని ఎయిర్ ఇండియా సంస్థ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా అసౌకర్యానికి గురైన వార్నర్, ఇతర ప్రయాణికులకు ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది.
భారత్ లో వార్నర్ కి అభిమానులు:
ఇక వార్నర్ కి భారతదేశంలో లక్షలాదిమంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వార్నర్ ఐపిఎల్ లో హైదరాబాద్, ఢిల్లీ తరపున ఆడడంతో ఆ ప్రాంతాల ప్రజలు అతడిని ఎంతగానో ఆదరిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో చేరువైపోయాడు. అలాగే తెలుగు సినిమాలలోని సాంగ్స్, డైలాగ్స్ కి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి వార్నర్ చేసిన రీల్స్ ఎంతగానో ఫేమస్ అయ్యాయి. దీంతో చాలామంది అభిమానులు అతడిని తెలుగు సినిమాలలో నటించాలని కోరారు. ఆ కల కూడా ఇప్పుడు నెరవేరబోతోంది. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Also Read: Pat Cummins: SRH 300 కొట్టడం పక్కా.. కమిన్స్ షాకింగ్ కామెంట్స్?
ఈ క్రమంలోనే వార్నర్ హైదరాబాద్ వేదికగా జరిగే రాబిన్ హుడ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు బెంగుళూరు నుండి హైదరాబాద్ బయలుదేరాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కించి వెయిట్ చేయించినందుకు వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటన పట్ల వార్నర్ అభిమానులు కూడా సహనం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
@airindia we’ve boarded a plane with no pilots and waiting on the plane for hours. Why would you board passengers knowing that you have no pilots for the flight? 🤦♂️🤦♂️
— David Warner (@davidwarner31) March 22, 2025