Andrew Symonds: ఆస్ట్రేలియా టీం అంటే ఒకప్పుడు ప్రత్యర్థి జట్లన్నీ భయపడిపోయేవి. ఆస్ట్రేలియా టీం లో అత్యంత భయంకరమైన ఆటగాళ్లు ఉండేవారు. ఇదంతా 2000 నుంచి 2010 మధ్యలో చూసాం. ఆ శకంలో రికీ పాంటింగ్, మెగ్రాత్, హెడెన్, గిల్ క్రిస్ట్, ఆండ్రు సైమండ్స్, బ్రెట్ లీ, గెలస్పీ , మైకేల్ క్లార్క్ , మైక్ హస్సి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లు ఉండేవారు. ఏ పొజిషన్లో వచ్చినా కూడా జట్టును గెలిపించి.. ప్రత్యర్థికి చుక్కలు చూపించేవారు. అదే సమయంలో ప్రత్యర్థి జట్టుపై విమర్శలు కూడా చేసేవారు. గ్రౌండ్ లోనే స్లెడ్జింగ్ కూడా చేసేవారు.
Also Read: Shikhar Dhawan : ప్రియురాలితో శిఖర్ ధావన్ ఘాట్ రొ**మాన్స్.. జిమ్ లోనే మొదలెట్టారు
అండ్రు సైమండ్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్
ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి జట్ల ప్లేయర్లను… గ్రౌండ్ లోనే ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. చుక్కలు చూపిస్తూ ఉంటాడు. గ్రౌండ్లో వాళ్ళతో గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటాడు. అలా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా ఆండ్రూ సైమండ్స్… హర్భజన్ సింగ్ మధ్య గొడవ జరిగింది. ఒక్కటేమిటి ప్రతి ఒక్క టీమిండియా ప్లేయర్ తో కూడా.. ఆండ్రు సైమాండ్స్ గొడవ పెట్టుకున్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు అండ్రు సైమండ్స్… చాలాసార్లు పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.. పబ్బుల్లోకి వెళ్లి… అక్కడ చిందులు వేసి, గొడవ కూడా పెట్టుకున్నాడు అండ్రు సైమండ్స్. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
గ్రౌండ్ లోనే ఫ్యాన్ ను చితకబాదిన ఆస్ట్రేలియా ప్లేయర్
ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్…. గ్రౌండ్ లోనే ఒక అభిమానిని చితకబాదాడు. షర్టు లేకుండా ఓ అభిమాని… సెక్యూరిటీని తప్పించుకొని గ్రౌండ్ లోకి పరిగెత్తాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఆస్ట్రేలియా ఆటగాడు అండ్రు సైమండ్స్… రెచ్చిపోయాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. చేజ్ మరి…. అభిమానిని పట్టుకొని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైమండ్స్
ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించిన సైమండ్స్…. 46 సంవత్సరాల వయసులోనే మృతి చెందాడు. 1975 జూన్ 9న జన్మించిన ఇతను… మే 14 2022 లో మరణించాడు. ఓ ప్రమాదకరమైన యాక్సిడెంట్ లో మృతి చెందాడు. ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు తరఫున 26 టెస్ట్ మ్యాచ్లు అలాగే 198 వన్డే మ్యాచ్లు ఆడాడు ఈ డేంజర్ ఆటగాడు. 1999 నుంచి 2007 సంవత్సరం వరకు… స్టార్ ఆటగాడుగా కొనసాగాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా ఆండ్రు సైమండ్స్ ఆడిన సంగతి తెలిసిందే. డెక్కన్ చార్జెస్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాడు.
Also Read: Hardik Pandya’s Ex wife : ప్రియుడితో కారులోనే సరసాలు.. నరకం అనుభవిస్తున్న పాండ్యా
?igsh=NWE0bjA0N21oNHI5