Big Stories

Defeats & Injuries in IPL 2024: ఓటమి బాధలు.. గాయాల బెడదలు.. ఐపీఎల్ సీజన్ లో హైలెట్స్!

Defeats and Injuries in IPL 2024
Defeats and Injuries in IPL 2024

Defeats and Injuries in IPL 2024: వైజాగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరుగులతో మోత మోగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలిచింది.

- Advertisement -

మ్యాచ్ విజయం సాధించిన తర్వాత కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ పేసర్ హర్షిత్ రాణా మైదానాన్ని ఎందుకు వీడాడో తెలీదని అన్నాడు. భుజాన్ని పట్టుకుని నొప్పితో బయటకు వెళ్లాడని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లినతర్వాత గానీ విషయం తెలీదని అన్నాడు.

- Advertisement -

ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయం తర్వాత ప్లేయర్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్ కి చేరిపోతే హార్దిక్ పాండ్యా మాత్రం ఒక్కడు ఒంటరిగా స్టేడియంలోనే ఉండిపోయాడు. మూడు మ్యాచ్ ల వరకు ఎంతో ఉత్సాహంగా వచ్చిన పాండ్యాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అతను ఊహించలేదు.

Also Read: Ambati Rayudu: ఇలాగైతే ఆర్సీబీ ఎప్పటికీ కప్ కొట్టలేదు.. అంబటి సీరియస్..!

ఇన్నాళ్లూ స్టేడియంలోకి వచ్చే అభిమానులు హార్దిక్ ను చూసి అభినందించేవారు, సపోర్ట్ చేసేవారు. ఆ ఉత్సాహంతో రెచ్చిపోయి ఆడేవాడు. కానీ ఇప్పుడలా కాదు. రోహిత్ అభిమానులు అందరూ గేలి చేయడంతో తను మానసికంగా కుంగిపోతున్నాడు. దీనికి జట్టు యాజమాన్యం గానీ, అటు రోహిత్ శర్మ గానీ ఎవరూ ముందుకు రావడం లేదు. అనవసరంగా గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చాన్రా బాబూ అనుకుంటున్నాడు. అంతేకాదు సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకున్నానని బాధపడుతున్నాడు.

ఆర్సీబీ విషయానికి వస్తే ఎప్పుడూ రెట్టించిన ఉత్సాహంతో ఉండే విరాట్ కొహ్లీ మూడో మ్యాచ్ కూడా ఓడిపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ లో నలుగురూ పక్కనే ఉన్నా.. ఎవరితోనూ మాట్లాడకుండా ఒక్కడే నిరాశగా కూర్చుండిపోయాడు. మ్యాచ్ లు గెలుస్తుంటారు.. ఓడిపోతుంటారు. కానీ ఒక్కసారి కూడా టోర్నమెంట్ గెలవని జట్టుగా ఆర్సీబీ చరిత్రలో నిలిచిపోతుందేమోననే బెంగ ఆటగాళ్లందరిలోకి వచ్చింది.

Also Read: GT vs PBKS Live Updates: శశాంక్ సింగ్, అశుతోశ్ శర్మ మెరుపులు.. ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం..

ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో డగౌట్ దగ్గర కూర్చోలేక ఢిల్లీ మెంటార్ సౌరభ్ గంగూలీ అటూ ఇటూ తిరగడం అందరి కంటా పడింది. ఒకవైపు నుంచి కోల్ కతా చితక్కొడుతుంటే, ఏం చేయాలో తెలీక, ఎం చెప్పాలో తెలీక తను కూడా బయట నుంచి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.

ఐపీఎల్ నుంచి గాయాలపాలు అవుతున్నవారున్నారు. అలాగే నిరాశ, నిస్పృహల మధ్య కూరుకుపోతున్నవారు కూడా ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News