BigTV English

Car Decoration on Wedding: వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. వీడికి మరీ ఏ ఐడియా దొరకలేదా..?

Car Decoration on Wedding: వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. వీడికి మరీ ఏ ఐడియా దొరకలేదా..?
Advertisement
Wedding Car Decorated by Chips Packets
Wedding Car Decorated by Chips Packets

Wedding Car Decorated by Chips Packets: పెళ్లి సీజన్ వచ్చేసింది. పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. ఏ వధూవరులకైనా ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఇక ఏముంది జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ పెళ్లి కోసం ఎన్నో ప్లాన్స్ వేస్తుంటారు. అందరికంటే భిన్నంగా చేసుకోవాలనే ఆలోచనలతో వినూత్న ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఉగాది ముందు ఆ తర్వాత మంచి ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు చేసుకునేందుకు పెళ్లి కాని ప్రసాదులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ తరుణంలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని, ఎవరు చేయని విధంగా వినూత్న ఆలోచనలు చేస్తూ అందరిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎంట్రీలను రకరకాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు.


ప్రస్తుతం జరుగుతున్న వివాహ వేడుకల్లో ఏదో ఒక విధంగా ఫేమస్ అవ్వాలని, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ వీడియోలు చేసి వైరల్ అవుతున్నారు. పెళ్లిళ్లలో పెళ్లి కొడుకు, కూతురు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరో ఒకరు చేసే పనులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి కొడుకు ఎంట్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పెళ్లి కొడుకు ఏంటి ఇలా ఎంట్రీ ఇచ్చాడు అంటూ బంధువులు అంతా నవ్వుకుంటున్నారు. అసలు ఆ వీడియో ఏంటీ, ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చేశాడో తెలుసుకుందాం.

Also Read:  ఏంటి భయ్యా వీడు.. నోట్లోనే పంపు సెట్ పెట్టేశాడా ఏంటి.. అలా వస్తున్నాయేంటి నీళ్లు


సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు తన ఎంట్రీ వినూత్నంగా ఉండాలని ప్రయత్నించాడేమో.. ఏకంగా కిరాణా షాపునే తన కారుకు తగిలించుకుని వచ్చాడు. పెళ్లి కొడుకు తాను ఎంట్రీ ఇచ్చే కారుకు చిప్స్ ప్యాకెట్లను అమర్చుకున్నాడు. ఇలా ఒక వంద చిప్స్ ప్యాకెట్లను కారు మొత్తం అంటే అద్దం మినహా అన్నింటిని చిప్స్ ప్యాకెట్లతో అలంకరించారు. ఇక ఆ కారులో పెళ్లి కొడుకు నెమ్మదిగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ కారుపై కూడా ఒకే రకమైన చిప్స్ ప్యాకెట్లు కాకుండా.. రకరకాల చిప్స్ ప్యాకెట్లను అమర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

?utm_source=ig_web_copy_link">

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘పెళ్లి కొడుకుకు కిరాణా షాపు ఉందేమో.. అందుకే అన్ని చిప్స్ ప్యాకెట్లు పట్టుకుని వచ్చాడు’ అని కామెంట్ చేశారు. మరొకరు కామెంట్ చేస్తూ.. పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కానుకగా ఇలా చేశారేమో అంటూ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రాంలో వైరల్ అవుతోంది.

Related News

దీపావళి వేడుకల్లో 70 మందికి పైగా గాయాలు

Viral video: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?

Viral Video: ఏంటీ.. ఇది ఆస్ట్రేలియానా? దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో!

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Viral Video: అండర్‌ వేర్‌ ను బ్యాగ్‌ గా మార్చేసి షాపింగ్.. ఆ మహిళ చేసిన పనికి అంతా షాక్!

Diwali Special Sweet: ఈ దీపావళి స్వీట్ చాలా కాస్ట్లీ గురూ.. కేజీ రూ.1.11 లక్షలు

Viral Video: విద్యార్థుల కేరింతల మధ్య.. స్కూల్ బెల్ కొడుతూ భాగోద్వేగానికి గురైన ఉద్యోగి, 38 ఏళ్లు అనుబంధానికి తెర!

Big Stories

×