IPL 2026 : టీమిండియా (Team India) క్రికెట్ లో మాదిరిగానే ఇప్పుడు ఐపీఎల్ లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు కెప్టెన్ గా సంజు శాంసన్ (Sanju Samson), ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా వేలంలోకి వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్నాయని మరో వార్త వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2026 (IPL 2026)లో ఢిల్లీ క్యాపిటల్స్ కి కొత్త కెప్టెన్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన అక్షర్ పటేల్ ను కేవలం ఆటగాడిగా కొనసాగించనున్నట్టు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు అక్షర్ పటేల్ టీమిండియా టీ-20 వైస్ కెప్టెన్ నుంచి తొలగించిన విషయం విధితమే.
Also Read : IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!
కెప్టెన్సీ రేసులో రాహుల్, వార్నర్
మరోవైపు డేవిడ్ వార్నర్, కే.ఎల్. రాహుల్ వంటి ప్లేయర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నట్టు సమాచారం. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్ లో అక్షర్ పటేల్ కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. ఒక్క సీజన్ కే అక్షన్ పటేల్ ను పక్కన పెట్టడానికి ఎలాంటి స్పష్టత లేదు. 2025 ఐపీఎల్ సీజన్ లో అక్సర్ పటేల్ కెప్టెన్సీ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. కెప్టెన్ గా కాస్త పర్వాలేదనిపించినప్పటికీ అక్షర్ పై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఒకవేళ అక్షర్ పటేల్ ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎవ్వరూ కెప్టెన్ గా ఎంపిక అవుతారనే విషయంలో ఆసక్తి నెలకొంది.
టీమిండియా మాదిరిగానే వ్యవహరిస్తున్న డీసీ..
వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కే.ఎల్. రాహుల్ లో వంటి అనుభవం ఉన్న ప్లేయర్ ఉన్నప్పటికీ ఈ సీనియర్ ప్లేయర్ గత సీజన్ లోనే తనకు కెప్టెన్ పదవీ వద్దని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న డుప్లెసిస్ వయస్సు 40 సంవత్సరాలు దాటాయి. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరినీ కెప్టెన్ గా చేస్తారంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సౌతాఫ్రికా యంగ్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడానికీ అతనికీ అనుభవం లేదు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న ఐపీఎల్ 2026 మినీవేలంలో ఢిల్లీ కెప్టెన్ మెటీరియల్ కోసం ఎవరికోసమైనా భారీగా ఖర్చు చేయవచ్చు. మినీ యాక్షన్ ముందు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.14.76 కోట్లు మిగిలి ఉన్నాయి. మరోవైపు ఇటీవలే అక్షర్ పటేల్ ను టీ-20 వైస్ కెప్టెన్ గా తొలగించి అతని స్థానంలో యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ కి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పదవీ కూడా అలాగే జరుగనుందని తెలుస్తోంది.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Delhi Capitals are likely to have a new captain for IPL 2026, with Axar Patel set to continue as a player in the team! (Source: Vaibhav Bhola/News 24) 🏏#IPL2026 #DelhiCapitals #AxarPatel #Sportskeeda pic.twitter.com/LhleESHcJN
— Sportskeeda (@Sportskeeda) August 31, 2025