Dhanashree Verma: భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ చాహల్ – అతని భార్య ధనశ్రీ వర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, చాహల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి తన సతీమణి ధనశ్రీ ఫోటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
Also Read: Martin Guptill Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్
ఈ జంట సన్నిహిత వర్గాలు కూడా వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని తెలియజేశారు. అయితే ఈ జంట మాత్రం ఇప్పటివరకు తమ విడాకుల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ జంటకి 2020లో వైభవంగా పెళ్లి జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించకపోవడం, ఈ రూమర్స్ నేపథ్యంలో వీరికి విడాకులు అయిపోయి ఉంటాయని చాలామంది అనుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా చాహల్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ” నిశ్శబ్దం లోతైన స్వరం. అది అన్ని శబ్దాల కంటే ఎక్కువగా వినబడుతుంది” అంటూ స్టోరీ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ పై రకరకాల అనుమానాలు వచ్చాయి. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమేనని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. అయితే వీరిద్దరి విడాకులకి కారణం ఏంటి..? ఇందులో తప్పు ఎవరిది..? అంటూ విచారణ మొదలుపెట్టారు నెటిజెన్లు.
ఈ క్రమంలోనే చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇంస్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రస్తుతం తనపై రాస్తున్న ఊహాజనిత వార్తలు, కథనాలపై తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. “ఇవన్నీ నిరాధారమైనవి. ఈ కథనాలు నాకు, నా కుటుంబానికి సవాల్ గా మారాయి. ఊహాజనిత తప్పుడు కథనాలతో నా క్యారెక్టర్ ను హ** చేశారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది.
నిజమేంటో తెలుసుకోకుండా ద్వేషాన్ని వ్యాపింపజేసే ముఖం లేని ట్రోలర్లు నా ప్రతిష్టను దిగజార్చడంతో నేను కలతకు గురయ్యాను. జీవితంలో ఎదగడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నా మౌనం బలహీనతకు సంకేతం కాదు. విలువలకు కట్టుబడి వాస్తవం పై దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాను.
Also Read: Younis Khan – Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ కోసం రంగంలోకి పాకిస్తాన్ క్రికెటర్.. ఇక కప్పు గ్యారంటీ?
నాకు సత్యం అండగా నిలుస్తుంది. సమర్ధించుకోవాల్సిన అవసరం లేదు. ఓం నమ: శివాయ” అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే చాహల్ – ధనశ్రీ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ గా మారడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లుగా తెలుస్తోంది. అంతేకాదు మరో కొరియోగ్రాఫర్ తో ఆమె క్లోజ్ గా ఉన్న ఫోటో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఆమె ఈ పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.