Priya Prakash Varrier: హీరో, హీరోయిన్లకు సినిమా అవకాశాలతోనే కెరీర్ ముందుకెళ్తుంది. దానివల్లే వారికి ఆదాయం కూడా వస్తుంది. అందుకే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ అందుకునే హీరోహీరోయిన్లు.. కాస్త ఫ్లాపులు ఎదురయ్యి బ్రేకులు పడిన తర్వాత రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం మొదలుపెడతారు. మరి మొత్తానికే అవకాశాలు లేకపోతే ఏం చేస్తారు.? ఆ ప్రశ్నకే ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది ఒక యంగ్ హీరోయిన్. ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమా ఛాన్సులు కొట్టేసినా.. ఇప్పుడు పూర్తిగా వెండితెరపై కనిపించడం మానేసింది. కానీ సంపాదన మాత్రం బాగానే వస్తుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
కెరీర్ స్లో
2019లో ఓమర్ లూలూ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒరు అదర్ లవ్’ సినిమా గురించి అసలు ప్రేక్షకులకు తెలియదు. అలాంటిది అందులో నుండి ఒక పాట విడుదలయ్యింది. ఆ పాటలో ఒక అమ్మాయి.. అబ్బాయిని చూసి కన్ను కొట్టింది. అంతే ఆ ఒక్క వింక్‌తో హీరో మాత్రమే కాదు.. కుర్రకారు మొత్తం ప్రేమలో పడిపోయారు. ఆ అమ్మాయే ప్రియా ప్రకాశ్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును పడేయడంతో తనకు ప్రేమగా వింక్ గర్ల్ అని పేరు పెట్టుకున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. మేకర్స్ కూడా ప్రియాకు ఫిదా అవ్వడంతో వెంటవెంటనే సినిమా అవకాశాలు అందించారు. అలా కొన్నేళ్లలోనే ఎక్కువ సినిమాల్లో నటించిన ప్రియా కెరీర్ ఇప్పుడు బాగా స్లో అయిపోయింది.
సోషల్ మీడియా వల్లే
2025లో తమిళంతో పాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier). తమిళంలో ఇటీవల ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిలవకు ఎన్ మేళ ఎన్నడి కోబం’ అనే సినిమాలో రెండో హీరోయిన్‌గా నటించింది. కన్నడలో ‘విష్ణు ప్రియా’ అనే మూవీతో డెబ్యూ చేసింది. ఈ రెండు సినిమాలు కాస్త పరవాలేదనిపించాయి. దీని తర్వాత మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టింది ప్రియా. అయితే ఒకవేళ సినిమా అవకాశాలు లేకపోతే సంపాదన ఎలా అని అడగగా.. దానికి సోషల్ మీడియా ఉంది అనే సమాధానం చెప్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా అనేది చాలామంది ఆదాయానికి ఆధారం అని చెప్పకనే చెప్పింది.
Also Read: ప్లాన్ చేసి తొలగించారు.. సుశాంత్ మరణంపై స్పందించిన నటుడు
తేడా చూపిస్తారు
‘‘నా దగ్గర సినిమా అవకాశాలు లేకపోయినా ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాను. బ్రాండ్స్, ప్రమోషన్స్ ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. వాటి వల్లే నాకు కాస్త రిలీఫ్ కలుగుతోంది. అయినా కూడా సినిమాల్లో నటించడమే నాకు ఇష్టం. అదే నా లక్ష్యం. కానీ నాకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి చాలామంది మేకర్స్ ఆలోచిస్తున్నారు, తేడా చూపిస్తున్నారు. చాలామంది నన్ను సాఫ్ట్ గర్ల్ అంటారు. అలాంటి పాత్రలకే సూట్ అవుతారని అనుకుంటారు. అలా అనుకోవడం వల్లే నాకు అవకాశాలు ఎక్కువగా రావడం లేదు’’ అని బయటపెట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్.