Mohammad Rizwan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50 కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 15 రోజులు ఫినిష్ అయితే టోర్నమెంట్ కు ఎండ్ కార్డు వేయవచ్చు. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB) ఆటగాడు విరాట్ కోహ్లీని హింసించేలా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకరేమో ముస్లిం మతంలోకి విరాట్ కోహ్లీని ( Virat Kohli ) ఆహ్వానిస్తుంటే.. మరి కొంత మంది అతడు చెత్త క్రికెటర్ అంటూ సోషల్ మీడియాలో కారు కూతలు కూస్తున్నారు. ఐపీఎల్ వదిలేసి, పీఎస్ఎల్ లోకి రావాలని మరికొందరు వింతగా అడుగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ గుళ్లో చేసే పూజలు కేవలం షో కోసం మాత్రమేనని బాంబు పేల్చారు. గుడికి వెళ్లాలనుకుంటే, సైలెంట్ గా వెళ్లాలి కానీ.. టీవీల్లో కనిపించేంతగా ఓవర్ చేయకూడదని హెచ్చరించారు. దీనివల్ల ఇతరుల మనోభావాలు దెబ్బతింటాయని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ఇద్దరూ నిత్యం గుళ్ళకు వెళ్తారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్ లో జీవనం కొనసాగిస్తున్న ఈ జంట.. ఇండియాకు వచ్చినప్పుడల్లా దేవాలయాల చుట్టూ తిరుగుతుంది. స్వామీజీల దగ్గరికి కూడా వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ. ఈ జంట ఏ గుడికి వెళ్లినా సరే, టీవీల్లో బ్రేకింగ్ లో మీద బ్రేకింగ్ లో వేస్తారు. సోషల్ మీడియాలో ఒకరోజు మొత్తం వీళ్ళ పేర్లు ట్రెండింగ్ లోకి వస్తాయి. అయితే దీనిపై మహమ్మద్ రిజ్వాన్ చాలా సీరియస్ అయ్యారు. విరాట్ కోహ్లీ దంపతులు గుడికి వెళ్లి ఇంత ఓవరాక్షన్ చేయడం అవసరమా అని ఇవ్వండి పడ్డారు మహమ్మద్ రిజ్వాన్.
గుడికి సైలెంట్ గా వెళ్లి.. రావాలి కానీ… టీవీల్లో కనిపించేలా మరీ ఎక్కువ చేయకూడదని చురకలు అంటించారు. దేవుడంటే నమ్మని విరాట్ కోహ్లీ అభిమానులు కూడా అతన్ని అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ దంపతుల గురించి ఒక్క మాట ఇకపైన మాట్లాడితే.. మహమ్మద్ రిజ్వాన్ ను ఉరి ఇస్తామని హెచ్చరిస్తున్నారు. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు కింగ్ కోహ్లీ ఫ్యాన్స్.