E-Paper
Advertisement

Rohit Sharma : రోహిత్ కెప్టెన్సీ ప్రమాదంలో పడిందా..? హిట్‌మ్యాన్‌పై బీసీసీఐ గుర్రుగా ఉందా..?

Rohit Sharma : రోహిత్ కెప్టెన్సీ ప్రమాదంలో పడిందా..? హిట్‌మ్యాన్‌పై బీసీసీఐ గుర్రుగా ఉందా..?
Advertisement

Rohit Sharma : ఆఫ్గాన్ తో జరిగే మూడో టీ 20లో గెలిచి, క్లీన్ స్వీప్ చేసి సిరీస్ గానీ గెలిస్తే, ఒక అద్భుతమైన రికార్డ్ రోహిత్ సేన ముందు రెడీగా ఉంది. వివిధ దేశాలతో టీ 20 సిరీస్ లు ఆడిన టీమ్ ఇండియా ఇప్పటి వరకు 8 సిరీస్ లను వైట్ వాష్ చేసింది. అంటే అన్ని మ్యాచ్ లకు అన్నిటిని కూడా గెలిచింది. పాకిస్తాన్ కూడా ఇలాగే 8 సిరీస్ లను వైట్ వాష్ చేసి టీమ్ ఇండియాతో సమానంగా ఉంది.

ఇప్పుడు మూడో టీ 20లో ఆఫ్గాన్ తో గెలిస్తే క్లీన్ స్వీప్ అవుతుంది. అప్పుడు 9 సిరీస్ లను వైట్ వాష్ చేసి నెంబర్ వన్ అయ్యే సువర్ణావకాశం, ఒక్క టీ 20 మ్యాచ్ దూరంలో ఉంది. మరి దీనిని రోహిత్ సేన సాధిస్తుందా? లేక రెండు గెలిచాం, సిరీస్ కూడా గెలిచేశామని రిలాక్స్ అవుతుందా? అనేది తెలీదు.

Advertisement

ఇకపోతే రోహిత్ ముందున్న మరో లక్ష్యం ఏమిటంటే, మొదటి టీ 20 లో సున్నా పరుగులకే రన్ అవుట్ అయిన కెప్టెన్, రెండో మ్యాచ్ లో గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అంటే మొదటి రెండు టీ 20లో ఒక్క పరుగు కూడా చేయలేదు. 14 నెలల తర్వాత టీ 20లోకి వచ్చిన రోహిత్ శర్మ పునరాగమనం ఇలా సున్నాదగ్గరే ఉండిపోవడం అటు అభిమానులకు నచ్చడం లేదు. అలాగే బీసీసీఐ సెలక్షన్ కమిటీ కి నచ్చడం లేదు. వాళ్లు కూడా అసంత్రప్తిగానే ఉన్నట్టు సమాచారం.

ఎందుకంటే ఎన్నో చర్చోపచర్చలు, వాదోపవాదాల మధ్య రోహిత్ శర్మకి కెప్టెన్సీ అప్పగించారు. దీనివల్ల ఎవరు బాధ్యత తీసుకున్నారో, వారికి తలనొప్పులు తప్పేలా లేవు. ముఖ్యంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్కడ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు రోహిత్ శర్మ మూడో టీ 20లో పరుగులు చేయకపోతే మాత్రం కెప్టెన్సీ ప్రమాదంలో ఉన్నట్టేనని అంటున్నారు.

Advertisement

ఎందుకంటే ఐపీఎల్ లో కూడా రోహిత్ శర్మ ఆడే అవకాశాలు లేవని అంటున్నారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ తో చెడిపోవడమే అందుకు కారణంగా చెబుతున్నారు. టీ 20 ప్రపంచ కప్ ముందు తను ప్రూవ్ చేసుకోవడానికి ఐపీఎల్ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో మిగిలిన ఆఖరి టీ 20లో రన్స్ చేసి సిరీస్ ని గెలిపించి, ఘనంగా ముగించి, టీ 20 ప్రపంచ్ కప్ నకు కెప్టెన్ గా రావాలని అభిమానులు కోరుతున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×