Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం వణికించింది. శుక్రవారం తెల్లవారుజామున పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 7.8గా నమోదు అయినట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో గుర్తించినట్టు పేర్కొంది.
దీని తర్వాత పలు భూప్రకంపనలు చోటు చేసుకున్నారు. 5.8 తీవ్రతతో మరొకటి వచ్చిందని పేర్కొంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. కమ్చట్కా విమానాశ్రయంలో టికెట్ల కేంద్రాలు, డిస్ ప్లే బోర్డులు బలంగా వణికాయి. దీంతో ఆ ప్రాంతంలో అత్యవసర సేవలు ప్రభుత్వం అలర్ట్ చేసింది.
తూర్పు తీరంలో 5 తీవ్రతో పైబడిన మూడు భూకంపాలు నమోదయ్యాయి. భూకంపం తర్వాత యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ సునామీ హెచ్చరికను జారీ చేసింది. భూకంపంపై రష్యాలోని కమ్చట్కా ప్రాంత గవర్నర్ మీడియా మాట్లాడారు. ద్వీపకల్పంలోని తూర్పు తీరంలో 7.2 తీవ్రతతో భూకంపం నమోదైందని తెలిపారు.
ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీలంగా ఉండే ప్రాంతాల్లో రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పసిఫిక్ ప్లేట్ ఉత్తర అమెరికా ప్లేట్‌ను కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా భూకంపాలు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నమాట.
ALSO READ: టిక్ టాక్ అమెరికా సొంతం.. యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో తూర్పు తీరంలో జూలై 29న 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ సముద్ర ప్రాంతమంతా సునామీ హెచ్చరికలను జారీ చేసింది. 2011 తర్వాత ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే. తీరప్రాంతంలోని ఓ గ్రామంలోని కొంత భాగం సముద్రంలోకి కొట్టుకుపోయింది.
భూకంపం తర్వాత రష్యా, జపాన్, అలాస్కా, గువామ్, హవాయి, ఇతర పసిఫిక్ తీరాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కమ్చట్కా ప్రాంతంలోని తీరంలో 3-4 మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడినట్టు రిపోర్టులు వస్తున్నాయి. దీనివల్ల సెవెరో-కురిల్స్క్ తీరప్రాంతల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ భూకంపం వల్ల హవాయికి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. భూకంపం తర్వాత బ్రిటిష్ కొలంబియా, కెనడాకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు చెప్పారు. మరోవైపు ఇండోనేషియాలో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు అయినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. శుక్రవారం వేకువజాము సమయంలో సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Check-in counter SHAKES at airport in Kamchatka
Emergency services on FULL alert
Three magnitude 5+ AFTERSHOCKS recorded off eastern coast https://t.co/ivXwIjUvoa pic.twitter.com/pwuWE6T4mU
— RT (@RT_com) September 18, 2025