Road accident: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ వెళ్తున్న చిన్నారిని స్కూల్ బస్సు గుద్దేసింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
తీరని విషాదం..
అసలు వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తోరగల్‌కు చెందిన చిన్నారి రోజులాగే స్కూల్‌కి వెళ్తుండగా అక్కడి నుంచి వస్తున్న స్కూల్ బస్సు చిన్నారిని గుద్దేసింది. వెంటనే అక్కడి స్థానికులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు. వారు ఎప్నుడు స్కూల్‌కి వెళ్లిపోతారా.. ఎప్పుడు ప్రశాంతంగా ఉందామా.. అని చూస్తు ఉంటారు. కానీ వారు చేసే ఈ తప్పు వల్లే చిన్నారుల బలైపోతున్నారు. పిల్లలను స్కూల్‌కి వెళ్లేటప్పుడు వారిని దగ్గర ఉండి పంపిస్తే పిల్లలు మీ పిల్లలు సేఫ్ లేదంటే పిల్లలు ఇంటికి వచ్చే వరకు గ్యారెంటీ లేకుండా పోయింది. కావున ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
Also Read: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు..
వృద్ధుడిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..
అలాగే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బస్టాండ్‌లో ఆరోగ్యం బాగోలేక ఓ వృద్దుడు మందుల కోసం మెడికల్ షాప్‌కి వెళ్ళి మందులు తీసుకుని వస్తుండగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ వస్సు ఢీ కోట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ప్రస్తుత సమాజంలో బయటికి వెళితే ఇంటికి వస్తామో.. రామో తెలియని పరిస్థితి నెలకొంది.