Shubman Gill: టీమిండియా కి కొత్త కెప్టెన్ శుబ్ మన్ గిల్ అని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ అని ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటి నుంచి టీమిండియా కెప్టెన్సీ రేసులో శుభ్ మన్ గిల్ ముందున్నాడు. భారత సెలెక్టర్లు, బీసీసీఐ గిల్ కి భారత టెస్ట్ జట్టు పగ్గాలు అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. టెస్ట్ ల్లో గిల్ అంత మంచి ట్రాక్ రికార్డు లేనప్పటికీ.. బీసీసీఊ పెద్దలు మాత్రం అతని వైపే మొగ్గు చూపుతున్నారు. బుమ్రా, కే.ఎల్.రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆప్షన్స్ ఉన్నా ఆల్ ఫార్మాట్ ఆటగాడని గిల్ ను వెనకేసుకొస్తున్నారు. టెస్ట్ కెప్టెన్ గా గిల్ అని అధికారికంగా ప్రకటించకముందే పొగరు చూపిస్తున్నాడు. ముఖ్యంగా గిల్ నడుచుకుంటూ వెళ్తుంటే ఓ యువతి అతనితో సెల్పీ దిగాలని ప్రయత్నించింది. కానీ గిల్ మాత్రం తనకేమి పట్టనట్టుగా పొగరుగా వ్యవహరిస్తూ వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Shubman Gill
Also Read : Rajiv Ghai on Virat: పాకిస్థాన్ తో యుద్ధం… ఆర్మీ ఫోకస్ మొత్తం కోహ్లీపైనే
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. గిల్ సారథ్యంలోనే భారత్ ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే గిల్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో భేటీ కానున్నాడని తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసే భారత టెస్ట్ జట్టుకు గిల్ సారధిగా నియమితుడైతే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీతో కలిసి ఓ చెత్త రికార్డును కూడా షేర్ చేసుకుంటాడు. గడిచిన 30 సంవత్సరాల్లో 30 కంటే తక్కువ బ్యాటింగ్ సగటుతో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్ గా మూటగట్టుకుంటాడు. ఈ జాబితాలో ధోనీతో పాటు రాహుల్ కూడా ఉన్నాడు.
ముక్యంగా సేనా దేశాలలో బ్యాటింగ్ సగటు 28.37 కాగా.. రాహుల్ బ్యాటింగ్ 29.60 గా ఉంది. గిల్ విషయానికి వస్తే.. సేనా దేశాల్లో అతని బ్యాటింగ్ సగటు ధోనీ, రాహుల్ కంటే అధ్వానంగా 25.70గా ఉంది. గిల్ టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ గా నియమితుడైతే ధోనీ, రాహుల్ తో పాటు చెత్త రికార్డును షేర్ చేసుకుంటున్నాడు. టెస్ట్ క్రికెట్ కి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం లోపే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ లకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. ఇవాళ ఉదయమే టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు కింగ్ కోహ్లీ. బీసీసీలోని కొందరూ పెద్దలు మాత్రం కోహ్లీని రిటైర్మెంట్ విషయం లో వెనక్కి తగ్గాలని కోరినప్పటికీ వినలేదని సమాచారం. గత ఏడాది టీ-20 వరల్డ్ కప్ తరువాత పొట్టి క్రికెట్ కి గుడ్ చెప్పిన కోహ్లీ.. తాజాగా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లకు కూడా వీడ్కోలు పలికాడు. దీంతో గిల్ కెప్టెన్ గా నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
?igsh=MWhvYWg1cGI1amtlaA==