Sumanth: అక్కినేని ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరో సుమంత్. కొన్ని రోజులుగా మూవీస్ కి బ్రేక్ ఇచ్చిన సుమంత్ ఇప్పుడు తాజాగా ఓ మూవీ ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. సుమంత్ హీరోగా ‘అనగనగా’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ మూవీని థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఈ టీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా హీరో సుమంత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన విషయాలు బయట పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంతకీ ఆ వీడియోలో సుమంత్ అక్కినేని హీరోస్ గురించి ఏమన్నాడో మనము చూద్దాం..
అక్కినేని ఫ్యామిలీపై సుమంత్ కామెంట్స్ ..
హీరో సుమంత్ ప్రస్తుతం అనగనగా అనే మూవీ ద్వార ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా మే 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ ఓ ఇంటర్వ్యూలో అక్కినేని ఫ్యామిలీ హీరోస్ గురించి మీకు బెస్ట్ అనిపించిన క్వాలిటీ చెప్పండి అని అడగ్గ.. సుమంత్ మాట్లాడుతూ ..అక్కినేని నాగేశ్వరరావు గారు లో బెస్ట్ క్వాలిటీ.. ఆయనలో చాలానే ఉన్నాయి. ఆయనతో నాకు ఫాదర్ రిలేషన్షిప్ ఉంది. ఓ కొడుకు లాగా ఆయన దగ్గర నేను పెరిగాను. సింపుల్ గా ఉండడం ఆయన్నుంచి నేర్చుకున్నాను. ఎంత డబ్బు సంపాదించిన, ఎంత పెద్ద హీరో అయినా, సింపుల్ గా ఉండడం, ఆయనకే సాటి.
నాగార్జున మాత్రమే అలా ..
హీరో నాగార్జున గురించి చెప్పాలంటే బెస్ట్ క్వాలిటీ, ప్రొఫెషనల్ గా ఆయన వెరైటీ రోల్స్ చేయడం, వేరియేషన్స్ ఆయన మూవీస్ లో ఎక్కువ చూస్తాము. అప్పట్లో అందరూ ఒకే లాగా మూవీస్ చేయడం మొదలుపెట్టారు.టాలీవుడ్ ఆ నలుగురు మాత్రమే రూలింగ్ చేసేవారు వారిలో వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణ చిరంజీవి, నలుగురిలో ఆయన మాత్రమే వెరైటీ క్యారెక్టర్స్ ఎంచుకొని నటించేవారు. అదే అయన లో గొప్పతనం అని సుమంత్ తెలిపారు.
ఆయనే నా ఫేవరేట్ ..హీరో
గతంలోనూ ఈయన ఓ ఇంటర్వ్యూలో తనకి అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంత మంది వున్నా నా ఫేవరెట్ హీరో ఎవరంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్తాను. చిన్నప్పుడు తాతగారు సినిమాల కన్నా ఎక్కువ సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఆయనంటే నాకు ఎక్కువ అభిమానం ఉండేది. ఆ తరువాత ఆయన కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం. అని సుమంత్ గతంలో తెలిపారు. ఇప్పుడు అనగనగా మూవీతో మే 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాజాల్ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ ఉపాధ్యాయుడి పాత్రలో నటిస్తున్నారు. నేటి విద్యా వ్యవస్థ లోని లోపాలను ఎత్తిచూపుతూ చిన్నారులకు ఏ విధంగా పాఠాలు చెప్తే బాగుంటుంది అనే కోణంలో ఈ మూవీ రూపొందించారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమంత్ కి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Anasuya : ఆడవాళ్ల జోలికొస్తే ఊరుకోను అనసూయ ఫైర్.. అందరి ముందే అలా మాట్లాడిందేంటి