Shreyas Iyer : టీమిండియా యంగ్ ప్లేయర్, సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం హాలీ డే మూడ్ లో ఉన్నాడు. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటించిన భారత టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. అందుకే తన కుటుంబంతో సమయం గడుపుతున్న శ్రేయాస్ అయ్యర్ ఇటీవలే ఖరీదైన కారు కొన్నాడు. అయ్యర్ మెర్సిడెస్ జి వాగన్ అనే కారును కొనుగోలు చేశాడు. దీని విలువ రూ.3కోట్లకు పైగానే ఉందని తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ తన కారులో ఫొటోకు ఫోజులు ఇస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రేయాస్ అయ్యర్ గురించి మరో వార్త వైరల్ అవుతోంది. తాజాగా హీరో రేంజ్ లో హెలికాప్టర్ లో దిగాడు సర్పంచ్ సాబ్.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Team India Record : టీమిండియా చెత్త రికార్డు… ఏకంగా 15 మ్యాచ్ లలో ఓడిపోయారా
శ్రేయాస్ అయ్యర్ కి హారతి
శ్రేయాస్ అయ్యర్ హెలికాప్టర్ లో దిగిరావడం.. మహిళలు అతనికి హారతి ఇవ్వడం కనిపిస్తోంది. ఇది ఎక్కడ జరిగిందనేది తెలియదు.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉండి ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. దీంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. వాస్తవానికి శ్రేయాస్ అయ్యర్ ఏ టీమ్ లో ఉంటే ఆ టీమ్ కి కాస్త లక్ కలిసొస్తుందని చెబుతుంటారు. 2024 ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఇలా ఫైనల్స్ మ్యాచ్ లు ఆడినా కానీ టీమిండియా టెస్ట్ క్రికెట్ లో మాత్రం అయ్యర్ కి చోటు దక్కడం లేదు. మరోవైపు శ్రేయాస్ టెస్ట్ క్రికెట్ కి సెలెక్ట్ అయ్యేదానిపై ఇటీవల ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్తితుల్లో శ్రేయాస్ కి టెస్ట్ జట్టులో చోటు దక్కడం కష్టమేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
టెస్ట్ బ్యాటింగ్ లో పోటీ
ప్రస్తుతం భారత టెస్ట్ బ్యాటింగ్ విభాగంలో తీవ్ర పోటీ నెలకొంది. చాలా మంది ఆటగాళ్లు తమ అవకాశాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం బ్యాటింగ్ లో సమస్య లేదు. శ్రేయాస్ కి ఇప్పుడే అవకాశం లభించదని.. మిగతా వారికి కూడా ఇంకా పూర్తి అవకాశాలు రాలేదని వెల్లడించాడు. టీమిండియాలో సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారని.. ధ్రువ్ జురెల్ జట్టులో ఉన్నప్పటికీ పక్కనే ఉన్నాడని.. ఐదో టెస్ట్ మ్యాచ్ కి ఎంపికయ్యాడు. సర్పరాజ్ ఖాన్ తనకు తాను పూర్తిగా నిరూపించుకోలేకపోయాడు. శ్రేయస్ దేశీయ క్రికెట్ లో, ఐపీఎల్ లో కెప్టెన్ గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీలో కూడా గణనీయమైన పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్ కి వచ్చే సరికి పరిస్థితి భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు చోప్రా. మరోవైపు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ కి చోటు దక్కకపోవడం పై ఇప్పటికే కొంతమంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.