BigTV English

Team India Record : టీమిండియా చెత్త రికార్డు… ఏకంగా 15 మ్యాచ్ లలో ఓడిపోయారా

Team India Record : టీమిండియా చెత్త రికార్డు… ఏకంగా 15 మ్యాచ్ లలో ఓడిపోయారా

Team India Record :  ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే 4 మ్యాచ్ లు జరిగాయి. అందులో 2 మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. 1 టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక నాలుగో టెస్ట్  మ్యాచ్ మాత్రం డ్రా అయింది. అయితే ఇవాళ ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇవాళ 5 టెస్ట్ మ్యాచ్ ప్రారంభంలో టాస్ సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓవల్ జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోయింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో భారత పురుషుల జట్లును బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఓవల్ టెస్ట్ లో టాస్ ఓడిపోవడంతో అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా వరుసగా 15 మ్యాచ్ ల్లో టాస్ ఓడిపోయిన జట్టుగా నిలిచింది.


Also Read :  Dhanashree Verma : చాహల్ భార్య ధన శ్రీ నడుముపై టాటూ.. శ్రేయాస్ కోసమేనా?

ఇక ఇందులో రెండు టీ-20 మ్యాచ్ లు, ఎనిమిది వన్డే మ్యాచ్ లు, ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఉండటం విశేషం. చివరగా ఈ ఏడాది జనవరి రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టీ-20లో టాస్ గెలిచింది టీమిండియా జట్టు. అటు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలవడం గమనార్హం. అయితే టాస్ ఓడిపోయినప్పటికీ.. ఈ మ్యాచ్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్ జట్టు మొదటి టెస్ట్, మూడో టెస్ట్ లో విజయం సాధిస్తే.. టీమిండియా 2 టెస్ట్ లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రా ముగిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గెలవాల్సిన మూడో టెస్ట్ టీమిండియా జట్టు స్వల్ప స్కోర్ నే ఛేదించలేక ఓటమిపాలైంది. దీంతో సిరీస్ కోల్పేయే ప్రమాదం ఉంది. కాబట్టి 5 టెస్ట్ మ్యాచ్ లో కచ్చితంగా విజయం సాధిస్తే.. టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను డ్రాతో ముగిస్తుంది. లేదంటే ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే.. టీమిండియా సిరీస్ కోల్పోతుంది.


భారత్ ఫస్ట్ బ్యాటింగ్ 

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఐదో టెస్టులో టీమిండియా మార్పులు చోటు చేసుకున్నాయి. రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కాంబోజ్ స్థానాల్లో జురెల్, కరుణ్ ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఐదో టెస్ట్ కి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో దూరమయ్యాడు. పోప్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. స్టోక్స్ తో పాటు ఈ మ్యాచ్ కి ఆర్చర్, కార్స్, డాసన్ స్థానాల్లో బెథెల్, అట్కిన్సన్, ఓవర్టన్, టంగ్ తుదిజట్టులోకి వచ్చారు.

టీమిండియా జట్టు : 

యశస్వి జైస్వాల్, రాహుల్, సుదర్శన్, శుబ్ మన్ గిల్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. 

ఇంగ్లాండ్ జట్టు : 

క్రాలీ, బెన్ డకెట్, పోప్, రూట్, హ్యారీ బ్రూక్, బెథెల్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, జెమీ ఓవర్టన్, జోష్ టంగ్.

 

Related News

FOX Spotted: మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వింత జంతువు… ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

IND vs ENG: టీమిండియాలో మొత్తం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లే…గిల్ విజయ రహస్యం ఇదేనా

Karishma Kotak : స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న యాంకర్.. వీడియో చూస్తే!

Vindhya Vishaka : సిరాజ్ కెరీర్ మొత్తం కష్టాలే.. తండ్రి చనిపోయినా మ్యాచ్ ఆడాడు.. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు

Prasidh Krishna : వీడు మామూలోడు కాదు… చెప్పి మరి వికెట్ తీశాడు.. ఇంగ్లీష్ వాడి పరువు తీశాడు

Gautam Gambhir : డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ చేసిన రచ్చ చూడండి

Big Stories

×