BigTV English

Joe Root: రూట్.. మరో సెంచరీ కొట్టేశాడు

Joe Root: రూట్.. మరో సెంచరీ కొట్టేశాడు

Joe Root sets new England record of 34 Test Hundreds: సెంచరీల మీద సెంచరీలు ఎడా పెడా కొట్టేస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ మంచి ఊపు మీదున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 141 పరుగులు చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా చితక్కొట్టి వదిలేశాడు. బజ్ బల్ వ్యూహంతో ఆడి 121 బంతుల్లో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా జో రూట్ (34) నిలిచాడు.


ఈ స్పీడులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ (33) రికార్డును అధిగమించాడు. అంతేకాదు పలువురు అంతర్జాతీయ క్రికెటర్ల రికార్డును సమం చేశాడు. ముఖ్యంగా బ్రయాన్ లార్ (34), సునీల్ గవాస్కర్ (34), జయవర్థనే (34), యూనిస్ ఖాన్ (34) వీరి సరసన చేరాడు.

అయితే వీరిపైన ఒక ఐదుగురున్నారు. వారిలో మొదటి నుంచి చూస్తే రాహుల్ ద్రవిడ్ (36), కుమార సంగక్కర (38), రికీ పాంటింగ్ (41), జాక్వెస్ కలిస్ (45), ఇంక నెంబర్ వన్ ప్లేస్ లో ఇండియన్ లెజండ్, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ (51) ఉన్నాడు. సెంచరీల పరంగా చూస్తే, సచిన్ దగ్గరకు రావాలంటే జో రూట్ ఇంకా 17 చేయాలి. 33 ఏళ్ల జో రూట్ మరెంత కాలం ఇలా ఆడతాడో వేచి చూడాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: పారా ఒలింపిక్స్ లో.. నేడు భారత్ ఆటలు

నాలుగేళ్లలో 17 సెంచరీలు చేసిన క్రికెటర్ గా కూడా జో రూట్ రికార్డు సృష్టించాడు. అయితే మన విరాట్ కొహ్లీ ఇక కళ్లు తెరవాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికి 29 టెస్టు సెంచరీలతో ఉన్న విరాట్.. రాబోయే టెస్టు మ్యాచ్ ల్లో అదరగొట్టాలని, జో రూట్ ను దాటేయలని అభిమానులు కోరుతున్నారు. కొందరేమంటున్నారంటే ఇక్కడ కొహ్లీ ఫామ్ లేక తంటాలు పడుతున్నాడు…అక్కడ రూట్ భీకరమైన ఫామ్ తో ఉన్నాడు.. అలా కోరుకోవడం అత్యాసే అవుతుందని అంటున్నారు.

విరాట్ కొహ్లీ ఫ్యామిలీ, పిల్లలు ఈ మోడ్ లోకి వెళ్లిపోయాడని కొందరు అంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. తనకింక స్థిరత్వం లేని రికార్డులు, సెంచరీలపై ఆసక్తిపోయిందని చెబుతున్నారు. బహుశా ఛాలెంజర్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేస్తాడని అంటున్నారు. అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత మరి ఆడితే ఆడతాడు లేదంటే లేదని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×