Big Stories

IPL 2024 LSG Vs CSK Preview: ధోనీ సేన ముందడుగు వేసేనా..? నేడు లక్నో వర్సెస్ చెన్నయ్ మధ్య పోరు!

LSG vs CSK IPL 2024 Match Preview and Prediction: ఐపీఎల్ మ్యాచ్ ల్లో చెన్నయ్ సూపర్ కింగ్స్ కూల్ గా విజయాలు సాధిస్తూ, అండర్ డాగ్ లా వెళుతోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పడుతూ లేస్తూ ముందడుగు వేస్తోంది. నేడు లక్నోలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30కి ప్రారంభం కానుంది.

- Advertisement -

ఐపీఎల్ 2024 సీజన్ లో  చెన్నయ్ ఎప్పటిలా మూడో స్థానంలోనే ఉంది. లక్నో మాత్రం 6 మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి, మూడు ఓడింది. రన్ రేట్ ప్రకారం పాయింట్స్ టేబుల్ లో 5వ స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య ఓవరాల్ గా మూడు మ్యాచ్ లు జరిగాయి. చెరొకటి విజయం సాధించాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

- Advertisement -

Also Read: Sunrisers VS Delhi Capitals IPL 2024 : హైదరా‘బాదుడు’.. మళ్లీ ఉంటుందా?

చెన్నయ్ సూపర్ కింగ్స్ లో అందరూ బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు. ఇంక ఎప్పటిలా బెస్ట్ ఫినిషర్ లా ధోనీ గూస్ బమ్స్ తెప్పిస్తున్నాడు. ఇంకా కుర్రాడిలా సిక్సుల మీద సిక్సులు, ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ మ్యాచ్ లను గెలిపిస్తున్నాడు. రచిన్ రవీంద్ర అండగా ఉంటున్నాడు. రవీంద్ర జడేజా, మహీష్ తీక్షణ, పతిరణ వీరందరూ బౌలింగులో రాణిస్తున్నారు.

ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంకా టచ్ లోకి రాలేదు. సగం మ్యాచ్ లు జరిగిపోయాయాయి. తన మార్క్ ఇన్నింగ్స్ ఇంకా ఆడలేదు. ఇప్పటికి సమయం మించిపోలేదు. ఇంకా హోప్స్ ఉన్నాయి. ఇప్పుడు సీఎస్కేని నిలువరిస్తే రేస్ లోకి వచ్చేస్తారు. దేవదత్ పడిక్కల్ ఇంకా నిరాశ పరుస్తున్నాడు.

Also Read: ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు.. పంజాబ్ పోరాట స్ఫూర్తికి జేజేలు

ఆయుష్ బదానీ, దీపక్ హుడా, మార్కస్ స్టోనిస్ వీళ్లందరూ ఆడితేనే సీఎస్కే మీద గెలిచే అవకాశాలున్నాయి. ఓపెనర్ డికాక్ , నికోలస్ పూరన్ అప్పుడప్పుడు మెరుస్తున్నారు. బౌలింగు విషయానికి వస్తే యష్ ఠాకూర్ అద్భుతంగా చేస్తున్నాడు. నవీన్, సిద్దార్థ్, మయాంక్ యాదవ్ విజృంభించాలి. ఎంతసేపు  కృనాల్  పాండ్యా, రవి బిష్ణోయ్ మీద డిపెండ్ అవుతున్నారు.

మొత్తానికి రాబోవు రోజుల్లో జాగ్రత్తగా ఉండాలంటే చెన్నయ్ గెలవక తప్పదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఓడిపోతున్నా దూసుకొస్తున్నట్టుగానే ఉంది. అందుకని పోటీ తప్పదు. టాప్ ఫోరులో ఉండాలంటే తమ శక్తులన్నీ కూడగట్టి లక్నో ఆడాల్సి ఉంది. మరేం జరుగుతుందో చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News