Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. క్రికెట్ లో ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేశాడు. అతడు ఏ జట్టులో ఉంటే ఆ జట్టు తప్పకుండా విజయం సాధిస్తుందని.. టి-20 ల్లో రషీద్ ఖాన్ గోల్డెన్ లెగ్ అని నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు రషీద్ ఖాన్ ప్రాతినిధ్యం వహించిన ఐదు జట్లు టోర్నమెంట్ విజేతలుగా నిలిచాయి.
Also Read: Rachin Ravindra injury: రచిన్ కు గాయం.. గ్రౌండ్ లో లైట్లే వేయలేదంటూ PCBపై ట్రోలింగ్ ?
దీంతో ఐసీసీ దశాబ్దపు టి-20 క్రికెటర్ గా నిలిచాడు రషీద్ ఖాన్. అతడు ప్రాతినిధ్యం వహించి, ఆయా జట్లు కప్ గెలుచుకున్న వివరాలను చూస్తే.. ఐపీఎల్ ట్రోఫీ {గుజరాత్}, పీఎస్ఎల్ ట్రోఫీ, బీబీఎల్ ట్రోఫీ, ఎమ్మెల్సీ ట్రోఫీ{Major League Cricket}, తాజాగా SA 20 ట్రోఫీ.. ఇలా అతడు ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా.. ఆ జట్టు కప్ ని ఎగరేసుకుపోతోంది. అంతేకాదు టి-20 చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు రషీద్ ఖాన్. అలాగే టి-20 ల్లో అత్యధిక హైట్రిక్ లు, ఇంటర్నేషనల్ లో రెండవ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
SA 20 2025 సీజన్ టైటిల్ ని ఎం.ఐ కేప్ టౌన్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. జోహాన్ బర్గ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుపై 76 పరుగుల తేడాతో ఎం.ఐ కెప్టౌన్ ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎం.ఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఇక 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్.. 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. SA 20 మొదటి రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన సన్రైజర్స్.. మూడవసారి కూడా ఫైనల్ లోకి దూసుకు వచ్చి హైట్రిక్ కొట్టాలని భావించింది.
కానీ ఈ జట్టుకు నిరాశ ఎదురయింది. ఈ విజయంతో ఎంఐ కేప్ టౌన్ జట్టు 34 మిలియన్ రాండ్లు {సుమారు 16.2 కోట్ల రూపాయలు} దక్కాయి. ఈ విజయంతోనే రషీద్ ఖాన్ ఈ రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక తాజాగా సౌత్ ఆఫ్రికా టి-20 లీగ్ లో పార్ల్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టి.. టి20 క్రికెట్ చరిత్రలో తన వికెట్ల సంఖ్యను 633 కు పెంచుకున్నాడు. కేవలం 461 మ్యాచ్లలోనే ఈ ఫీట్ ని సాధించాడు.
Also Read: Ashish Nehra: నెహ్రా నువ్వు తోపు.. అద్దె కట్టుకోలేని కోచ్ కోసం బంగ్లా రాసిచ్చేశాడు ?
18.08 సగటుతో ఈ వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరుపున 161 వికెట్లు పడగొట్టాడు రషీద్ ఖాన్. మిగిలిన వికెట్లు దేశవాళీ క్రికెట్ తో పాటు వివిధ లీగ్ లలో పడగొట్టాడు. ఇక టి-20 క్రికెట్ లో రషీద్ ఖాన్ బెస్ట్ 17/6 గా ఉంది. ఇక రషీద్ ఖాన్ ప్రతినిత్యం వహించిన ప్రతీ జట్టు విజయకేతనం ఎగురవేస్తుండడంతో.. అతడు గోల్డెన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
– Won ICC T20 Cricketer of Decade.
– T20 WC Semi as Captain.
– Won IPL Trophy
– Won PSL Trophy
– Won BBL Trophy
– Won MLC Trophy
– Won SA20 Trophy
– Most wickets in T20 History
– Most Hattricks in T20s
– 2nd Most Wickets in T20I Int'l.– RASHID KHAN, THE GOAT IN T20 CRICKET.🐐🙇 pic.twitter.com/ewzBOOlDGg
— Tanuj Singh (@ImTanujSingh) February 9, 2025