Rachin Ravindra injury: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కంటే ముందు జరుగుతున్న ట్రై సిరీస్ లో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. బంతి నేరుగా వచ్చి అతడి ముఖానికి తగలడం వల్ల తీవ్ర గాయమైంది. రక్త మోడుతున్న స్థితిలో అతడు మైదానాన్ని విడిచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Ashish Nehra: నెహ్రా నువ్వు తోపు.. అద్దె కట్టుకోలేని కోచ్ కోసం బంగ్లా రాసిచ్చేశాడు ?
మరికొద్ది రోజులలో ఛాంపియన్ ట్రోఫీ 2025 ప్రారంభం కాబోతున్న పరిస్థితులలో అతడు ఈ స్థాయిలో గాయపడడం న్యూజిలాండ్ అభిమానులను ఆందోళనలోకి నెట్టినట్టయింది. ముక్కోనపు వన్డే సిరీస్ లో భాగంగా లాహోర్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో ఓ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతడి నుదుటికి బంతి బలంగా తాకింది. దీంతో వెంటనే మైదానంలోకి పరిగెత్తుకొచ్చిన ఫిజియోలు.. రక్తస్రావం ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఫిజియోల సహాయంతో రవీంద్ర మైదానాన్ని వీడాడు.
38వ ఓవర్ వేసిన స్పిన్నర్ మైఖేల్ బ్రాస్ వెల్ బౌలింగ్ లో మూడవ బంతిని పాకిస్తాన్ బ్యాటర్ కుస్తీల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర.. ఆ బంతిని అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో ఆ బంతి నేరుగా వెళ్లి అతడి నుదుటికి తాగింది. అయితే ఫ్లడ్ లైట్ల వెలుతురు వల్ల బంతి సరిగా కనిపించకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక రచిన్ రవీంద్రని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
రచిన్ రవీంద్ర గాయపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే పాకిస్తాన్ లోని గడాఫీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురు తక్కువగా ఉండడం వల్లనే రచిన్ రవీంద్ర ఆ బంతిని అంచనా వేయలేకపోయాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస మౌలిక వసతులు సైతం సరిగ్గా లేని పరిస్థితులలో.. ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీని పాకిస్తాన్ లో నిర్వహించడం పట్ల ఇప్పుడు క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్ లు మినహా.. మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా పాకిస్తాన్ లో షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ లోని కరాచీ, లాహోర్, రావల్పిండిలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఎప్పుడూ చురుకుగా కనిపించే రచిన్ రవీంద్రకి ఇప్పుడు గడాఫీ స్టేడియంలో గాయం కావడంతో అభిమానులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: IND VS ENG 2ND ODI: నేడే రెండో వన్డే..కోహ్లీ ఎంట్రీ…ఆ ముగ్గురు ప్లేయర్లపై వేటు ?
ఇలాంటి స్టేడియాన్ని అంతర్జాతీయ మ్యాచ్ లకు ఎలా అనుమతి ఇచ్చారని ఐసీసీ ని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇలాంటి స్టేడియాలలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం కంటే.. దుబాయ్ కి తరలించడమే ఉత్తమమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం భారత్ అందుకే పాకిస్తాన్ లో పర్యటించడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.