Brohmatsavam: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిమాయత్‌నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 3 నుంచి జూన్ 7 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 2 న అంకురార్పణంతో వార్షిక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన అధికారులు
ఆలయంలో జరిగిన సమావేశంలో టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 3న ఉదయం 6.30 గంటల నుంచి 8.45 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ధ్వజావరోహణం తర్వాత, శేష వాహనంపై దేవుడి ఊరేగింపు అంగరంగా వైభవంగా జరగనుందని వివరించారు. అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ హనుమంత వాహనంపై ఊరేగింపు జరుగుతుందని అన్నారు. జూన్ 4న ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
ALSO READ: Court Jobs: కోర్టులో 1620 ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా?
అన్నప్రసాదం పంపిణీ
ఆ తర్వాత మరుసటి రోజు.. జూన్ 5న ఉదయం 10 గంటలకు గజ వాహనంపై దేవుడి ఊరేగింపు ఉంటుందని, అలాగే శాంతి కళ్యాణం నిర్వహించినున్నట్టు చెప్పారు. సాయంత్రం 8 గంటలకు గరుడ వాహనం ఊరేగింపు నిర్వహిస్తామని AEO రమేష్ తెలిపారు. అనంతరం.. జూన్ 6న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగింపు ఉంటుందని అన్నారు. జూన్ 7న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, ధ్వజావరోహనం జరుగుతాయని వివరించారు. ఆలయంలో భక్తులకు ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు.
ALSO READ: Telangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..! ప్రపంచంలో మరెక్కడా జరిగిన విధంగా..