ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే.. అది వాష్ రూమ్ మాత్రమే. కాసేపు అన్ని సమస్యలను మర్చిపోయి, ప్రశాంతంగా గడిపే ప్లేస్ అదొక్కటే. తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే, అక్కడ కూడా ప్రశాంత కరువైనట్లు అర్థం అవుతోంది. అంతేకాదు, ప్రాణాలు కూడా పోవడం పక్కా అనిపిస్తుంది. ఇంతకీ అసలు ఏం జరుగిందంటే..
తాజాగా ఓ వ్యక్తి రాజస్థాన్ లోని అజ్మీర్ కు వెళ్లాడు. వెళ్లిన పని పూర్తి కాకపోవడంతో పుష్కర్ లోని ఓ హోటల్ దిగాడు. రాత్రి చక్కగా పడుకున్నాడు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని బ్రష్, స్నానం గట్రా కార్యక్రమాలు పూర్తి చేయాలనుకున్నాడు. బాత్ రూమ్ లోకి వెళ్లి మూత్ర విసర్జన చేశాడు. ఫ్లష్ ఆన్ చేశాడు. ఆ తర్వాత జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. కమోడ్ నుంచి ఏకంగా భారీ కోబ్రా బయటకు వచ్చింది. నల్ల రంగులో సుమారు 5 అడుగుల పొడవుతో భయంకరంగా ఉంది. తల పైకెత్తి బసులు కొట్టింది. ఒక్కసారిగా సదరు వ్యక్తి వాష్ రూమ్ నుంచి బయటకు పరుగులు తీశాడు. వెంటనే హోటల్ సిబ్బందికి విషయం చెప్పాడు.
హోటల్ సిబ్బంది స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. హోటల్ కు వచ్చిన స్నేక్ క్యాచర్ బృందం వాష్ రూమ్ లో ఉన్న నల్లని త్రాచును చూసి షాకయ్యారు. అంతపెద్ద పాము అందులోకి ఎలా వచ్చిందా? అని పరేషాన్ అయ్యారు. అతి కష్టం మీద ఆ పామును పట్టుకుని బస్తాలో బందించారు. ఆ తర్వాత దాన్ని అడవిలో వదిలేశారు. అయితే, వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నట్లు స్నేక్ క్యాచర్స్ వెల్లడించారు. కొన్ని ఆపార్ట్ మెంట్లలోనూ ఇలా పాములు వచ్చినట్లు గుర్తించామన్నారు. అటు ఈ ఘటనపై హోటల్ లో దిగిన వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్ల భద్రతను పట్టించుకోవడంలో విఫలం అయ్యారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pushker के एक Hotel कमोड से निकला 5 फीट लंबा Cobra | Ajmer | Cobra Snake | Viral |#Ajmer #Rajasthan #Cobra #CobraSnake #Snake pic.twitter.com/qTPLR6Ubzj
— भारत की बात (@Bharatkebat) September 20, 2025
అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ఘటన పట్ల నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేశారు. “అంత పెద్ద పాము కమోడ్ లోకి ఎలా వచ్చింది? అదీ రెండు అంతస్తుల హోటల్ లోకి?” అంటూ కామెంట్ చేశాడు. “ఇలాంటి వీడియోలను చూస్తే, మనకు కూడా వాష్ రూమ్ కు వెళ్లినప్పుడు భయం కలుగుతుంది. తమ వాష్ రూమ్ లోనూ పాములు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “వాష్ రూమ్ లోకి పాములు రాకుండా ఏం చేయాలో ఎవరైనా చెప్పండి. ఇలాంటి ఘటన మా వాష్ రూమ్ జరిగితే నా ప్రాణాలు పోవడం ఖాయం” అని ఇంకో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.
Read Also: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?