Telangana Inter Exams: తెలంగాణలో నిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు నిర్వహించిన పరీక్షకు మొత్తం 96.63 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 5,14,184 మందికి గానూ 4,96,899 మంది హాజరయ్యారని ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మొత్తం 17,010 మంది స్టూడెంట్స్ గైర్హాజరయ్యారని ఆయన చెప్పారు.
ALSO READ: APSSDC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.. జీతమైతే అక్షరాల రూ.3,30,000
‘హన్మకొండ, వరంగల్ జిల్లాలో రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు ప్రత్యేక పరిశీలకులు వెళ్లారు’ అని అన్నారు. పరీక్షల ఏర్పాట్లను కృష్ణ ఆదిత్య స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్‌లోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యం కారణంగా వందల సంఖ్యలో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలకు కొన్నిచోట్ల ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించారు. మరొకొన్ని చోట్ల గేట్లు మూసేయడంతో ఆపై ఆలస్యంగా వచ్చిన వారు వెనుదిరగాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 4,40,788 రెగ్యులర్, 67,735 ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 5,08,523 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.
ALSO READ: SECR Recruitment: టెన్త్, ఐటీఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. పూర్తి వివరాలివే..
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఎగ్జామ్ ఫీజు పే చేయలేదని ఓ స్టూడెంట్ కి కళాశాల యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వడానికి తిరస్కరించింది. అయితే బాధిత విద్యార్థి చివరకు నిన్న మార్నింగ్ ఫీజు చెల్లించిన తర్వాత హాల్ టికెట్ ఇచ్చినా.. విద్యార్థి పరీక్షా కేంద్రానికి చేరుకునే సరికి 20 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఆలస్యం కారణంగా నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో బాధపడుతూ విద్యార్థి ఇంటికి వెళ్లారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం లో ఓ ఇంటర్ స్టూడెంట్ తనకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లకుండా మరో ఎగ్జామ్ సెంటర్ కు పోయాడు. అతను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్ కిలోమీటర్ దూరం ఉండడంతో ఆందోళనతో పరిగెత్తుకుంటూ వెళ్ల సాగాడు. బాధిత స్టూడెంట్ పరిస్థితిని గమనించిన ముథోల్ ఎస్సై సంజీవ్ ఆ విద్యార్థిని పోలీసు వాహనంలో ఆ కేంద్రానికి సకాలంలో చేర్చడంతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాడు. దీంతో ఎస్సై సంజీవ్ ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలని కామెంట్ చేస్తున్నారు.
ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే పైసలే పైసల్ భయ్యా.. ఈ అర్హత ఉంటే ఇప్పుడే..?
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడకు చెందిన దివ్యాంగురాలు శివానీని ఆమె తండ్రి సత్యనారాయణ మర్రిగూడలోని పరీక్షాకేంద్రానికి ఎత్తుకుని తీసుకు వెళ్లారు. దీంతో శివానీ విజయవంతంగా పరీక్ష రాసింది. కుమార్తె అభ్యున్నతికి తండ్రి పడుతున్న తపన పట్ల నెటిజన్లు అభినందిస్తున్నారు.