Csk fans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా శుక్రవారం రోజు చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్. ఏకంగా 50 పరుగుల తేడాతో సీఎస్కే నీ చిత్తుగా ఓడించింది ఆర్సిబి. ఈ విజయంతో చెపాక్ లో ఆర్సిబి 17 ఏళ్ల తర్వాత గెలుపొందింది.
Also Read: Jayawardene: బుమ్రా ఎప్పుడు వస్తాడో చెప్పలేం.. జయవర్ధనే సంచలన ప్రకటన
ఈ సీజన్ లో ప్రతి జట్టు విధ్వంసకర బ్యాటింగ్ తో 200కు పైగా పరుగులు చేస్తుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం టి-20లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతోంది. ఆ జట్టు బౌలింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్ విభాగం మాత్రం దారుణంగా విఫలమవుతుంది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర సాయంతో గట్టెక్కిన సీఎస్కే.. రెండవ మ్యాచ్ లో మాత్రం దారుణంగా విఫలమైంది.
ఈ మ్యాచ్ కి ముందు లెక్కలన్నీ చెన్నైకి అనుకూలంగానే ఉన్నాయని అన్నారు. పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుందని విశ్లేషించారు. అనుకున్నట్టుగానే ఆర్సిబి టాస్ ఓడిపోయింది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించింది. ఆర్సిబి ఇన్నింగ్స్ లో స్లోగా ఆడింది ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ మాత్రమే. చెపాక్ స్టేడియంలో యావరేజ్ స్కోరు 170 మాత్రమే.
కానీ ఈ మ్యాచ్ లో బెంగళూరు 196 పరుగులు చేసిందంటే ఎంత ప్లానింగ్ తో ఆర్సిబి బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రెండవ ఓవర్ లోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఋతురాజు గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి రెండు బంతుల వ్యవధులలోనే జోష్ హెజిల్ వుడ్ కి చిక్కారు. అలా చెన్నై పతనం మొదలైంది.
కాసేపు దూబే పోరాడినా.. ప్రయోజనం దక్కలేదు. ఇక ఓడిపోతున్నామనే నిరాశలో ఉన్న చెన్నై అభిమానులకు చివరలో రెండు సిక్స్ లతో అలరించాడు మహేంద్ర సింగ్ ధోని. 16 బంతులలో 30 పరుగులు చేశాడు. అయితే చెన్నైలో రచిన్ రవీంద్ర {41} తర్వాత ధోని ఒక్కడే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో చెన్నై కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ పై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు.
Also Read: Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేదు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్
ఎందుకంటే మ్యాచ్ అనంతరం ఋతురాజు గైక్వాడ్ మాట్లాడుతూ.. మేము 50 పరుగుల తేడాతోనే ఓడిపోయాం.. ఇదేం భారీ మార్జిన్ కాదని అన్నాడు. టి-20 లలో 50 ల పరుగుల తేడాతో ఓడిపోవడం అంటే భారీ కాదా..? అని ప్రశ్నిస్తున్నారు సీఎస్కే అభిమానులు. కెప్టెన్ మైండ్ సెట్ ఇలా ఉంటే..? ఇక గెలవాలన్న కసి జట్టులోని మిగతా ప్లేయర్లకు ఎలా ఉంటుందని నిలదీస్తున్నారు.