BigTV English

Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేడు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్

Sehwag on MS Dhoni: స్టంపింగ్ చేయడంలో ధోనిని కొట్టేవాడు లేడు.. ఫిదా అయిపోయిన సెహ్వాగ్

Sehwag on MS Dhoni: క్రికెట్ లో లెజెండరీ ప్లేయర్ గా ప్రఖ్యాతిగాంచిన మహేంద్రసింగ్ ధోని టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఐసిసి ట్రోఫీలు అందించాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ధోని ఓ గొప్ప కెప్టెన్, గొప్ప బ్యాటర్ మాత్రమే కాదు.. గొప్ప వికెట్ కీపర్ కూడా. వికెట్ కీపింగ్ లో ఇప్పటికీ ఎదురులేని రారాజు ధోని. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రం ఆడుతున్నాడు.


 

వరల్డ్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా ధోని ఎప్పుడో తన మార్క్ చూపించాడు. రెప్పపాటు లో స్టంప్ అవుట్ చేయడం, చూడకుండా రనౌట్ చేయడం, బౌలర్ కి లోకల్ లాంగ్వేజ్ లో సూచనలు ఇస్తూ బ్యాటర్ ని కన్ఫ్యూజ్ చేయడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య. అసలు ధోని వికెట్ల వెనక ఉన్నాడంటే.. తెలివైన బ్యాటర్ ఎవ్వరూ క్రీజ్ ని సెంటీమీటర్ కూడా దాటేందుకు సాహసించరు. కానీ ఈ ఐపీఎల్ 18వ సీజన్ లో ఇదంతా తెలిసి ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాత్రం అత్యుత్సాహం చూపించాడు. ఫలితంగా తన వికెట్ సమర్పించుకున్నాడు.


ఈ ఐపీఎల్ లో సీఎస్కే తొలి మ్యాచ్ లో నూర్ అహ్మద్ బౌలింగ్ లో ముంబై బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులతో క్రీజ్ లో ఉండగా.. ధోనీకి ఓ మెమొరబుల్ మూమెంట్ దక్కింది. సూర్య అలా క్రీజ్ బయటకు కాలు పెట్టాడో లేదో ధోని స్టంప్ అవుట్ చేశాడు. 43 ఏళ్ల వయసులోనూ తనలో జోష్ తగ్గలేదని నిరూపించుకున్నాడు. ధోని స్టంప్ అవుట్ చేసాక సూర్య కుమార్ యాదవ్ మైండ్ బ్లాంక్ అయ్యి కాసేపు అలానే నిలబడిపోయాడు.

11 ఓవర్ లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్య కుమార్ యాదవ్ కాస్త ముందుకు వెళ్లి బంతిని మిస్ చేశాడు. దీంతో తన చేతిలోకి వచ్చిన బంతితో కేవలం 0.12 సెకండ్ల లోనే స్టంప్ చేశాడు ధోని. ఆ తర్వాత శుక్రవారం రోజు చెన్నై – బెంగళూరు మ్యాచ్ లో ధోనీకి మరోసారి మెరుపు క్షణం లభించింది. ఈ మ్యాచ్ లో నాలుగవ ఓవర్ చివరి బంతికి నూర్ అహ్మద్ వేసిన లెంగ్త్ బాల్ ఆఫ్ సైడ్ వైపుగా స్వల్పంగా బయటకు వెళ్ళింది.

ఆ సమయంలో బ్యాటర్ ఫిల్ సాల్ట్ డ్రైవ్ ప్రయత్నించగా.. అది బ్యాట్ కి తగలకుండా వెనక్కి వెళ్ళింది. ఆ సమయంలో ధోని బంతిని సులువుగా క్యాచ్ చేసి.. 0.10 సెకండ్ లోనే సాల్ట్ ని స్టంప్ అవుట్ చేశాడు. అప్పటికే మెరుపు బ్యాటింగ్ తో 16 బంతులలో 32 పరుగులు చేసిన సాల్ట్ ని.. ధోని అద్భుత స్టంపింగ్ తో అతడి ఇన్నింగ్స్ కి బ్రేక్ వేశాడు. ఈ స్టంపింగ్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తేలిగ్గా తీసి పారేశాడు.

 

ధోని స్టంపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ” అదేమీ అంత అద్భుతమైన స్టంపింగ్ కాదు. ఏ వికెట్ కీపర్ అయినా అలా చేయగలరు. సాల్ట్ కాలు అప్పటికే క్రీజ్ బయట ఉంది. అతడు వెనక్కి పెట్టేందుకు కూడా ట్రై చేయలేదు. కానీ వికెట్ కోసం నూర్ తో కలిసి ప్లాన్ చేసి ఉంటే.. ఈ స్టంపింగ్ చెప్పుకోదగింది. ఈ వయసులోనూ ధోనీ కీపింగ్ ని మెచ్చుకోవాలి” అన్నాడు వీరేంద్ర సెహ్వాగ్.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×