BigTV English

Women In Toilet House : ఆఫీస్ బాత్‌రూంలో వంట, నిద్ర.. బతకనేర్చిన పిల్ల!

Women In Toilet House : ఆఫీస్ బాత్‌రూంలో వంట, నిద్ర.. బతకనేర్చిన పిల్ల!

Women In Toilet House : బాత్‌రూమ్. ఈ పదం వింటేనే చాలామంది అదో రకంగా ఫేస్ పెడతారు. టాయిలెట్ అనగానే.. గబ్బు వాసన, డర్టీనెస్ ఇలా ఏదేదో ఊహించుకుంటారు. బాత్రూంకు వెళితే ఎప్పుడెప్పుడు బయటకొస్తామా అనేంత దరిద్రంగా కొన్ని ఉంటాయి. కొందరైతే అక్కడే గంటల తరబడి తిష్ట వేస్తారు. వారికి అదో ఆనందం మరి. సిగరెట్ కంపు, యాసిడ్ స్మెల్.. రకరకాల నెగటివ్ షేడ్స్. ఇంట్లో ఒకలా.. ఆఫీసులో ఇంకోలా. కార్పొరేట్ కంపెనీలు బానే మెయిన్‌టెన్ చేస్తాయి కానీ, చిన్నచిన్న సంస్థల్లో అయితే అందులోకి వెళ్లకపోతేనే మంచిది. ఇలా బాత్రూంలు పలు రకాలు. అది ఏ రకమైనా వాష్‌రూమ్‌తో కాసేపే పని. అంతేగానీ, అక్కడే ఉంటాం.. అక్కడే తింటాం.. అక్కడే పడుకుంటాం.. అంటే ఎవరైనా ఎప్పుకుంటారా? కానీ, ఓ అమ్మాయి ఆఫీసులోని బాత్రూంనే తన ఇంటిగా ఎంచుకుంది. అద్దెకు తీసుకుని మరీ, టాయిలెట్‌కు రెంట్ కడుతూ.. అందులోనే నివసిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా.. ఆ యువతి చేస్తున్న పని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.


అద్దెకు ఆఫీస్ టాయిలెట్

చైనాకు చెందిన 18 ఏళ్ల యాంగ్. ఓ ఫర్నీచర్ షాప్‌లో పని చేస్తోంది. ఆమెకు వెరైటీ ఆలోచన వచ్చింది. ఆ ఐడియా ఆమె జీవితాన్ని మార్చేసింది. వేలకు వేలు ఇంటి అద్దె కట్టడం వల్ల డబ్బులు వేస్ట్ అనుకుంది. బాస్‌తో మాట్లాడి తాను పని చేసే ఆఫీసులోని వాష్‌రూమ్‌ను రెంట్‌కు తీసుకుంది. నెలకు రూ.545 ఇచ్చేలా డీల్ కుదిరింది. ఇంకేం. ఎంచక్కా బాత్రూంకు మకాం మార్చేసింది. అప్పటినుంచి అక్కడే వండటం, తినడం, పడుకోవడం.


వాష్‌రూమ్‌ను ఎలా సెట్ చేసిందంటే..

ఆ వాష్‌రూమ్‌.. చిన్న హాల్ అంత ఉంటుంది. ముందు భాగంలో ఓ మిర్రర్, రెస్ట్ ప్లేస్. సైడ్‌లో కమోడ్స్. అదే ఇప్పుడు ఆమె ఇల్లు. అక్కడే ఫోల్డబుల్ బెడ్ వేసింది. కమోడ్స్ కనిపించకుండా క్లాత్‌ను కర్టెన్‌లా కట్టింది. చిన్న కబోర్డ్ లాంటిదాంట్లో కిచెన్ సామాన్లు సర్దింది. బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్ రాడ్ కూడా ఉంది. పోర్టబుల్ స్టౌవ్‌తో వంట చేస్తుంది. బాత్రూంలోనే బట్టలు ఉతుకుతుంది. ఆఫీస్ బిల్డింగ్‌పై వాటిని ఆరేస్తుంది. ఇలా అచ్చం ఇల్లులానే అందులో హ్యాపీగా ఉంటోంది యాంగ్. మరి, వాష్‌రూమ్ కదా.. వాసన రాదా అనుకునేరు. ఎలాంటి స్మెల్ రాకుండా ప్రతీరోజూ నైట్ చాలా నీట్‌గా క్లీన్ చేస్తుందట. ఉదయం కాగానే.. మంచం, సామాన్లు, కర్టెన్లు అన్నీ ఒక పక్కకు సర్దేస్తుంది. ఇక్కడ ఒకరు ఉంటున్నారనే విషయం ఆ వాష్‌రూమ్‌కు వచ్చే వాళ్లకు ఎవరైనా చెబితే కానీ గుర్తించలేనంతగా సామాన్లు సెట్ చేస్తుందట యాంగ్. తన బాత్రూం ఇంటిని ఆమెనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడీ వీడియో వరల్డ్ వైడ్ వైరల్ అవుతోంది. స్మార్ట్ గర్ల్ అని కొందరు.. వాట్ ఆన్ ఐడియా అని మరికొందరు.. బతకనేర్చిన పిల్ల అంటూ మరికొందరు.. చాలామంది ఆ 18 ఏళ్ల యువతిని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read : లవ్ చేసి.. 6 కోట్లు కొట్టేసి..

పాపం.. ఆ ఓనర్ మంచోడబ్బా..

ఇక్కడో డౌట్ రావొచ్చు. ఆమె పనిచేసే ఫర్నీచర్ షాప్ ఓనర్‌కు మరీ అంత కక్కుర్తి ఎందుకు? బాత్రూంను అద్దెకు ఇవ్వడం ఏంటని? అయితే, తన పరిస్థితి వివరించి ఆఫీసులోనే ఓ మూలన కొంత స్థలం తనకు రెంట్‌కు ఇవ్వమని యాంగ్ రిక్వెస్ట్ చేసిందట. తనకు కాస్త చోటిస్తే.. నెలకు 2వేలు రెంట్ కూడా ఇస్తానంది. ఆ ఓనర్ కాస్త మంచోడిలా ఉన్నట్టున్నాడు. రెంట్ గట్రా ఏమొద్దు కానీ.. కరెంట్, వాటర్ బిల్లు కట్టుకోమని చెప్పాడట. ఆ అమౌట్ రూ.545 మాత్రమే తీసుకుంటున్నాడు. అయితే, షాపులో తనకు కావాల్సిన చోట ఉండమని ఛాన్స్ ఇచ్చినా.. యాంగ్ మాత్రం వాష్‌రూమ్‌లోనే ఉంటానని చెప్పి అక్కడే ఉంటోందట.

పిసినారి తనమా? ఫ్యూచర్ ప్లానింగా?

అలాగని యాంగ్ జీతం మరీ తక్కువేం కాదు. నెలకు రూ.34,570. అన్ని ఖర్చులకూ కలిపి నెలకు 4,500 ఖర్చు చేస్తుందట. మిగతాదంతా సేవింగ్సే. కూడబెట్టిన డబ్బులతో త్వరలోనే ఇల్లు లేదా కారు కొంటానని.. అప్పటి వరకూ ఈ బాత్రూంలోనే ఉంటానని చెబుతోంది. ఈ చైనా చిన్నది ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ ఆమె పిసినారి పిల్లా? తెలివైన అమ్మాయా?

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×